Owaisi: హైడ్రా నోటీసులు.. ఢిల్లీలో రేవంత్ తో ఒవైసీ భేటీ వెనక రహస్య ఎజెండా అదేనా..

Owaisi: రీసెంట్ గా హైదరాబాద్ లో బపర్ జోన్, ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న అసదుద్దీన్ ఒవైసీ అక్రమంగా కట్టిన కట్టడాలపై  హైడ్రా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రేవంత్ తో ఒవైసీ భేటీ  కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనక రహస్య ఎజెండా అదేనా అంటున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 9, 2024, 12:05 PM IST
Owaisi: హైడ్రా నోటీసులు.. ఢిల్లీలో రేవంత్ తో ఒవైసీ భేటీ వెనక రహస్య ఎజెండా అదేనా..

Owaisi: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా తో ఉక్కుపాదం మోపుతున్నాడు తెలంగాణ ప్రభుత్వం. ముందుగా రేవంత్ సర్కారుకు హైడ్రాతో మంచి పేరు వచ్చినా.. రాను రాను పేదల ఇళ్లపై బుల్‌డోజర్లు రావడంసై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ మాదాపూర్ లో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడం పెద్ద సంచలనమే అయింది. సినీ ఇండస్ట్రీ నుంచి నాగార్జున తెలంగాణ ప్రభుత్వానికి అంతగా సహకరించక పోవడం.. అంతేకాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన ఉండటం మూలానా.. ఆయన ఎన్ కన్వెన్షన్ కూల్చినట్టు తెలుస్తుంది. పూర్తిగా రాజకీయ కక్ష్యతోనే నాగ్ కు సంబంధించిన కట్టడాన్ని రేవంత్ సర్కార్ కూల్చినట్టు చెబుతున్నారు. మరోవైపు హైదరాబాద్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్స్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు చెందిన పలువురు కీలక నేత పై బుల్‌డోజర్లు మాత్రం వెళ్లడం లేదు. మరోవైపు మూసీ పరిరక్షణ అంటూ పేదల ఇళ్లపై రేవంత్ సర్కార్ పడటం సర్వత్రా విమర్శల పాలైంది.

మొత్తంగా హైడ్రా పెద్దల విషయంలో ఓ లాగా.. కామన్ పీపుల్ విషయంలో మరో లాగా ప్రవర్తిస్తుందనే టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ లో ఉన్న సెక్రటేరియట్,  ఐమాక్స్, జీహెచ్ఎంసీ మెయిన్ ఆఫీసు, బాపూ ఘాట్ సహా పలు కట్టడాలు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టు సంచలన వ్యాఖ్యలు చేసారు.  తాజాగా ఈయన ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!

ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..

దేశ రాజధాని ఢిల్లీలో సీఎం అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో హైడ్రా కూల్చివేతలు, ఓల్డ్ సిటీ, నాంపల్లిలో రీసెంట్ గా నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా అసద్ కాలేజీలకు హైడ్రా నోటీసులు ఇవ్వడం...దీనిపై ఒవైసీ బ్రదర్స్ స్ట్రాంగా రియాక్ట్ కావటం జరిగింది. దీనికి తోడు హైడ్రా విషయంలో ఒవైసీ కాలేజీలు కూల్చకపోవటంపై సర్కార్ తీరులో విమర్శలు వచ్చాయి. వీటిపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సమావేశంలో వీరిద్దరి మధ్య రాజకీయంగా ఓ సయోధ్య కుదిరినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు.. సామాన్యులు ఇతరుల విషయాల్లో స్పందించినట్టు ఓల్డ్ సిటీలోని కట్టడాలతో పాటు ఒవైసీ ఛీప్ కు సంబంధించిన కట్టడాల జోలికి పోవడం లేదనే టాక్ వినిపిస్తోంది.
 

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

Trending News