Navaratri 2024: నవరాత్రి మూడో రోజు అమ్మవారి అలంకరణ.. పూజావిధానం పెట్టాల్సిన నైవేద్యం..

Navaratri 2024 Third Day Alankaran: నవరాత్రుల్లో 9 రోజులపాటు దుర్గాదేవి 9 అవతారాలను పూజిస్తారు. పెత్తర అమావాస్య మరుసటి రోజు ప్రారంభమవుతాయి. ఇవి తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. అయితే, నవరాత్రి మూడో రోజు అన్నపూర్ణదేవి అలంకరణ చేస్తారు.
 

1 /5

నవరాత్రుల్లో ప్రత్యేకంగా నవదుర్గలను పూజిస్తారు. ముఖ్యంగా 9 రోజులపాటు దేశవ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. అయితే, నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారి అలంకరణ అన్నపూర్ణ దేవి. తెలుగు రాష్ట్రాల్లో బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఏ అలంకరణ చేస్తారో ప్రతిపాదికన తీసుకుంటారు.  

2 /5

అన్నపూర్ణాదేవి అలంకరణలో ఈరోజు అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రోజు పూజించేవారు పసుపు,కుంకుమ, అక్షితలతో అమ్మవారిని పూజిస్తారు. 9 రోజులపాటు తొమ్మిది రకాల ప్రసాదాలను కూడా అమ్మవారికి సమర్పిస్తారు.  

3 /5

ఈసారి నవరాత్రుల్లో మూడో రోజు 5వ తేదీ శనివారం రానుంది. ఈ సందర్భంగా ఈ రోజు అన్నపూర్ణ దేవిని పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి ముఖ్యంగా గంధం రంగులో ఉండే చీరను సమర్పిస్తారు. లేకపోతే పసుపు రంగు చీర కూడా అమ్మకు ఇష్టమే.  

4 /5

పసుపు అంటేనే దానగుణానికి అర్థం. ఈ అమ్మ అనుగ్రహంతోనే సమస్త జీవులకు ఆహారం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు అన్నపూర్ణ దేవికి నైవేద్యంగా దద్దోజనం పెడతారు. అదేవిధంగా అల్లంతో తయారు చేసిన గారెలు, క్షీరాన్నం నైవేద్యంగా పెడతారు.  

5 /5

ఇక దసరా పండుగ ఈ ఏడాది 12వ తేదీ శనివారం రానుంది. నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్‌ ౩న ప్రారంభమయ్యాయి. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)