Konda Surekha Controversy: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ను ఉద్దేశిస్తూ కామెంట్ చేయడమే కాకుండా.. ఈ వివాదాల్లోకి సినీ సెలబ్రిటీలను కూడా లాగుతూ నానా రచ్చ చేసింది. ముఖ్యంగా నాగచైతన్య - సమంత విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయాలని ప్రస్తావన వచ్చినప్పుడు కేటీఆర్ సమంతను పంపిస్తే, కూల్చడం ఆపేస్తానని చెప్పాడు. దీంతో నాగార్జున సమంతను రిక్వెస్ట్ చేయగా.. ఆమె రిజెక్ట్ చేసింది. అందుకే సమంత - నాగచైతన్యకు విడాకులు ఇప్పించారు నాగార్జున అంటూ సంచలన కామెంట్లు చేయడంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ఈ విషయాలను తిప్పుకొడుతూ ఏంటి సిగ్గులేని రాజకీయాలు అంటూ ట్వీట్ వేశాడు. వెంటనే నాగార్జున కూడా స్పందిస్తూ.. దయచేసి మా వ్యక్తిగత కుటుంబ విషయాలపై ఇలా అబద్ధాలు చెప్పడం మానుకోండి. దయచేసి మీ వ్యాఖ్యలను మీరు వెనక్కి తీసుకోండి. మీరు చెప్పేవన్నీ అసత్యాలు అంటూ ఫైర్ అయ్యారు.
అంతేకాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ విషయాలపై స్పందించారు. సినీ ఆడవాళ్లు అంటే మీకెందుకు అంత చులకన. గౌరవమైన పదవిలో ఉన్నారు. మీరు కూడా ఒక ఆడవారు అని మర్చిపోయారా అంటూ చురకలు అంటించారు.
సింగర్ చిన్మయి, నాచురల్ స్టార్ నాని తో సహా చాలామంది సెలబ్రిటీలు అక్కినేని కుటుంబానికి, సమంతకు అండగా నిలుస్తూ కొండా సురేఖ పై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఈ వార్తలు సమంత వరకు చేరడంతో సమంత కూడా స్పందించింది. దయచేసి తనను రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వాటిల్లోకి లాగవద్దు అంటూ కూడా ఆమె కోరింది.
నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు.
— Konda surekha (@iamkondasurekha) October 2, 2024
దీంతో ఎట్టకేలకు దిగొచ్చింది కొండా సురేఖ. సినీ సెలబ్రిటీలంతా ఒక్కసారిగా వరుస ట్వీట్స్ చేస్తూ దాడి చేయడంతో తన తప్పు తెలుసుకొని క్షమాపణలు చెబుతూ ఒక ట్వీట్ కూడా చేసింది. సమంతకు క్షమాపణలు కోరుతూ.. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణి ని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు
స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా అంటూ సమంతను ట్యాగ్ చేస్తూ కొండా సురేఖ ట్వీట్ చేసింది. ఇక ఎట్టకేలకు సెలబ్రిటీల దాడికి తట్టుకోలేక సమంత ను క్షమాపణలు కోరింది కొండా సురేఖ. అయితే ఇది కొండా సురేఖ అఫీషియల్ అకౌంట్ కాదు అంటూ కొంతమంది చెప్పడం గమనార్హం. కాబట్టి కొండా సురేఖ..మీడియా ముందుకి వచ్చి చెబితే కానీ ఈ విషయం తేలేతట్టు లేదు.
నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బతీయడం కాదు.
స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..
— Konda surekha (@iamkondasurekha) October 2, 2024
Also Read: Nani: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం.. ఖండఖండాలుగా ఖండించిన హీరో నాని
Also Read: Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి