Pension Rules: పెన్షనర్లకు బిగ్ అలర్ట్..పెన్షన్ తీసుకోవాలంటే ఇక పై ఈ రూల్స్ పాటించాల్సిందే..!

Pension Rules: రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది. పెన్షనర్లకు 2024 నవంబర్ 6వ తేదీ  నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆ నిబంధనలు ఏంటో చూద్దాం. 

1 /7

Pension Rules: పదవి విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యగమనిక. ఎందుకంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది. పెన్షనర్లకు 2024 నవంబర్ 6వ తేదీ  నుంచి ఈ  కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇకపై అన్ని పెన్షన్ అప్లికేషన్స్ తప్పనిసరిగా పెన్షన్ ఫారమ్ 6ఏ ద్వారా ఆన్ లైన్ ల సబ్‌మిట్ చేయాలి. 

2 /7

భవిష్యత్ లేదా e-HRMS 2.0 పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అప్లికేషన్ హార్డ్ కాపీలను ఇకపై అంగీకరించరు. పెన్షన్ పాలసీలను డిజిటలైజ్ చేయడానికి, క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ఈ కొత్త రూల్స్ తీసుకువచ్చింది.   

3 /7

దీనికి సంబంధించి సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత ప్రభుత్వ పెన్షన్, పెన్షనర్లు సంక్షేమ శాఖ ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గతంలో పెన్షన్ అప్లికేషన్ ఫామ్స్ పేపర్ పై జరుగుతుండేవి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి పదవీ విరమణ చేసే ఉద్యోగులు తమ పెన్షన్ దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి. 

4 /7

పదవీ విరమణ చేసే సిబ్బంది సౌలభ్యం కోసం గతంలో ఉన్న అన్ని రకాల పెన్షన్ ఫారమ్స్ కలిసి సింప్లిఫైడ్ పెన్షన్ ఫారమ్ 6ఏ ను తయారు చేశారు. దీనికి సీసీఎస్ లోని 53, 57, 58, 59,60 పెన్షన్ రూల్స్ సవరించారు.

5 /7

వ్యయ శాఖ లా అండ్ జస్టిస్ డిపార్ట్ మెంట్, కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వంటి అన్ని శాఖల సలహా తర్వాత ఈ సవరణలు చేసినట్లు వెల్లడించింది.   

6 /7

నవంబర్ 16 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి రిటైర్మెంట్ పొందిన సిబ్బందికి ఇది అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 2024 నవంబర్ 4నే విడుదల అయ్యింది.

7 /7

పెన్షన్ ప్రాసెస్ ను మరింత సమర్థవంతంగా సులభతరం చేసేందుకు ఈ ఆన్ లైన్ పోర్టల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పుల్లో భాగంగా పెన్షన్ ప్రాసెస్ లను సరిగ్గా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.