NEET PG 2024 Results: నీట్ పీజీ 2024 ఫలితాలు విడుదల natboard.edu.in ఇలా చెక్ చేసుకోండి

NEET PG 2024 Results: దేశవ్యాప్తంగా పీజీ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పీజీ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన నీట్ పీజీ ఫలితాలను natboard.edu.in, nbe.edu.in ద్వారా చెక్ చేసుకోవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 24, 2024, 06:50 AM IST
NEET PG 2024 Results: నీట్ పీజీ 2024 ఫలితాలు విడుదల natboard.edu.in ఇలా చెక్ చేసుకోండి

NEET PG 2024 Results: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. natboard.edu.in, nbe.edu.in వైబ్‌సైట్స్ ద్వారా NEET PG 2024 ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.  దేశంలోని పీజీ వైద్య విద్యా కోర్సుల అడ్మిషన్లు దీని ద్వారా జరుగుతాయి. 

దేశంలోని వైద్య విద్యా కళాశాలల్లో పీజీ కోర్సుల భర్తీకు ప్రతి ఏటా జరిగే నీట్ పీజీ 2024 పరీక్ష ఈ ఏడాది ఆలస్యమైంది. నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ ఇతర వివాదాలతో జూన్ 23న జరగాల్సిన పరీక్ష వాయిదా పడి ఆగస్టులో జరిగింది. ఇప్పుడు ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా 26,699 ఎఁడీ, 13,886 ఎంఎస్, 922 పీజీ డిప్లొమా కోర్సులు నీట్ పీజీ 2024 ద్వారా భర్తీ కానున్నాయి. రెండు దశల్లో నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపుగా 2 లక్షల 16 వేల మంది హాజరయ్యారు. నీట్ పీజీ 2204 మొదటి దశలో 1,07,959 మంది హాజరు కాగా, రెండో దశకు 1.08,177 మంది హాజరయ్యారు. ఆగస్టు 11వ తేదీన నీట్ పీజీ 2024 పరీక్ష జరిగింది. మరి కొద్దిరోజుల్లో వ్యక్తిగత స్కోర్ కార్డులు విడుదలవుతాయి. NEET PG 2024 ఫలితాలను ఇలా చెక్ చేసుకోవాలి.

ముందుగా అధికారిక వెబ్‌సైట్స్ natboard.edu.in, nbe.edu.in ఓపెన్ చేయాలి. స్క్రీన్‌పై కన్పించే నీట్ పీజీ 2024 ఫలితాలను క్లిక్ చేయాలి. ఇప్పుడు పీడీఎఫ్ విండో ఓపెన్ అవుతుంది. దిగువకు స్క్రోల్ చేయాలి. అందులో మీ అప్లికేషన్ ఐడీ, రోల్ నెంబర్ ఆధారంగా ఫలితాలు చూసుకోవచ్చు. నేరుగా మొత్తం పీడీఎఫ్ ఫైల్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 30 నుంచి నీట్ పీజీ స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

Also read: Mild Heart Attack: మైల్డ్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి, 5 ప్రధాన లక్షణాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News