Brahmmavaram PS Paridhilo: నిజమైన హీరో కథే.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో'..

Brahmmavaram PS Paridhilo Movie Updates: ఈ నెల 23న ఆడియన్స్ ముందుకు వచ్చే రెడీ అవుతోంది బ్రహ్మవరం పీఎస్ పరిధిలో మూవీ. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌ను తప్పకుండా అలరిస్తుందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్రవంతి బెల్లకొండ అన్నారు.

Written by - Ashok Krindinti | Last Updated : Aug 19, 2024, 12:58 PM IST
Brahmmavaram PS Paridhilo: నిజమైన హీరో కథే.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో'..

Brahmmavaram PS Paridhilo Movie Updates: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'బ్రహ్మవరం పీఎస్‌ పరిధిలో' సినిమా ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీని ఆగస్టు 23న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో స్రవంతి బెల్లంకొండ, గురు, సూర్య శ్రీనివాస్, హర్షిణి ప్రధాన పాత్రలు పోషించారు. స్రవంతి బెల్లంకొండ కీలక పాత్ర పోషించడంతోపాటు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. సినిమాటిక్ ట్రీట్‌గా ఉంటుందని.. తప్పకుండా ఆడియన్స్‌ను మెప్పిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. 

Also Read: iQOO Neo9 Pro 5G Price Drop: వావ్‌ ఏం డిస్కౌంట్‌.. రాఖీ వేళ అమెజాన్‌లో Iqoo Neo9 Pro 5G మొబైల్‌పై రూ.33,000 తగ్గింపు!

ఈ సందర్భంగా స్రవంతి బెల్లంకొండ మీడియాతో ముచ్చటించారు. ఈ సినిమాకు కథే నిజమైన హీరో అని అన్నారు. కొత్తదనం కోరుకునే ఆడియన్స్‌కు ఈ సినిమా ఫస్ట్ ఆప్షన్‌ అవుతుందన్నారు. సమ్మెట గాంధీ, ప్రేమ్ సాగర్, జీవా, రూప లక్ష్మి వంటి టాలెంటెడ్ నటులతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవమని అన్నారు. తనను ప్రధాన పాత్రలో ఎంపిక చేసినందుకు టీమ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 23న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకువస్తున్నామని.. ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

డైరెక్టర్ ఈ చిత్రాన్ని నెక్ట్స్ లెవల్ అన్నట్లుగా చిత్రీకరించారని చెప్పారు స్రవంతి బెల్లంకొండ. తప్పకుండా తెలుగు ప్రేక్షకులు మెచ్చే చిత్రమవుతుందన్నారు. ఈ మూవీకి ఎడిటర్‌గా ఆవుల వెంకటేష్ పనిచేశారు. శ్రీ వెంకట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిచగా.. శ్రీనివాస్ మౌళి లైవ్ లిరిక్స్, సాకేత్ సాయిరామ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. DOP బాధ్యతలు ముజీర్ మాలిక్ నిర్వర్తించారు.

Also Read: Raksha Bandhan 2024: వైఎస్‌ జగన్‌కు రాఖీ కట్టని షర్మిల.. అన్నాచెల్లెళ్ల మధ్య పెరుగుతున్న దూరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News