Viraaji Director Adhyanth Harsha: ‘విరాజి’ సినిమా దర్శకుడు ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ.. మా సొంత ఊరు నెల్లూరు.
తిరుపతి లో బయోటెక్నాలజీలో బీటెక్ చేశాను. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి బయో టెక్నాలజీలో ఎంఎస్, పీహెచ్ డీ ఇన్ న్యూరో సైన్స్ చేశాను. అక్కడే ఫిల్మ్ మేకింగ్ లో కోర్స్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సమయంలోనే సినిమాల కోసం పది కథలు రాసుకున్నాను. 2019లో భారత్ తిరిగి వచ్చాను. దర్శకుడిని కావాలనేది నా డ్రీమ్. అదొక్కటే టార్గెట్ గా పనిచేస్తూ పోతున్నాను. ఈ క్రమంలో నాకుటుంబ సభ్యులు నాకు ఎంతో అండగా నిలబడ్డారు. ఇక్కడికి వచ్చాకు మూడు షార్ట్ ఫిలిమ్స్, 37 నిమిషాల నిడివితో ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ రూపొందించాను. ఆ ఫిల్మ్ నచ్చి ఒకరు రెండు లక్షల రూపాయల కు కొనుక్కున్నారు. అప్పుడు నాలో ఆత్మ విశ్వాసం పెరిగింది. లాస్ట్ ఇయర్ 'విరాజి' కథను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కు చెప్పాను. ఆయన నిర్మాత మహేంద్రనాథ్ కి పరిచయం చేశారు. నా కథ బాగుందని వినమంటూ మహేంద్రకి ఆయన చెప్పడం, నేను వెళ్లి కథ చెప్పడం జరిగింది.
'విరాజి' కథ మహేంద్రనాథ్ కి బాగా నచ్చింది. ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా అని హీరోగా ఎవర్ని అనుకుంటున్నావ్ అని అడిగారు. నాకు మొదటి నుంచి ఈ సినిమా కోసం మైండ్ లో వరుణ్ సందేశ్ ఉన్నాడు. 'విరాజి' సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు ఆండీ. ఈ పాత్ర ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంది. వరుణ్ యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు ఆ స్లాంగ్, బాడీ లాంగ్వేజ్ బాగా సెట్ అవుతుందని అనిపించింది. అలా హీరోగా వరుణ్ సందేశ్ ను ఎంపిక చేసినట్టు చెప్పాడు.
వరుణ్ సందేశ్ ను కలిసి కథ చెప్పాను. ఆయన ఫస్టాఫ్ విని బాగుందన్నారు. సెకండాఫ్ విని గూస్ బంప్స్ వచ్చాయి మనం తప్పకుండా ఈ మూవీ చేద్దామన్నారు. అలా 'విరాజి' ప్రీ ప్రొడక్షన్ మొదలైంది. ఆరు నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ చేశాం. ఈ సినిమాలోని ప్రతి షాట్ ఎలా ఉండాలో ఆ షాట్ లో వాడే ప్రతి వస్తువు వివరాలు పేపర్ లో రాసుకున్నాం. ఈ సినిమాలో వెయ్యి షాట్స్ ఉంటే వాటికి వెయ్యి పేపర్స్ రెడీ చేసుకున్నాం. చిన్న బడ్జెట్ సినిమాలకు సెట్ లో ఎక్కువ వృథా లేకుండా ఉంటేందుకు ప్రతీది పేపర్ పై డిజైన్ చేసుకుని సెట్స్ మీదకు వెళ్లాం.
సినిమా షూటింగ్ పూర్తయ్యాక దాదాపు 4 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం పనిచేశాను. 'విరాజి' అనే టైటిల్ కు నాకు అనిపించిన మీనింగ్ చీకట్లో ఉన్నవారికి వెలుగులు పంచేవాడు. 'విరాజి' అంటే శివుడు అని కూడా కొందరు చెప్పారు. సొసైటీలో ఉన్న కొన్ని ఇష్యూస్ ను తెరపై చూపించాలనేది దర్శకుడిగా నా లక్ష్యం. ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లర్ వంటి అంశాలు ఉన్నా...అండర్ కరెంట్ గా కొన్ని సోషల్ ఎలిమెంట్స్ చూపించబోతున్నాము. తెరపై చూసి ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. ఇప్పుడు సొసైటీలో ఉన్న ఒక కాంటెంపరరీ ఇష్యూని తెరపైకి తీసుకొస్తున్నాము0. మీరు 'విరాజి' చూసి బయటకు వచ్చేప్పుడు ఆ పాయింట్స్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది.
'విరాజి' కథ లైన్ చెప్పాలంటే ఓ పది మంది కొండమీద ఉండే ప్లేస్ కు వెళ్తారు. అది మూసివేసిన పిచ్చాసుపత్రి అని తెలుస్తుంది. వాళ్లు బయటకు వచ్చి చూస్తే వాళ్ల కారు ఉండదు. మొబైల్ లో సిగ్నల్స్ ఉండవు. ఆ టైమ్ లో ఆండీ అనే వ్యక్తి వారి దగ్గరకు వస్తాడు. అతను వచ్చాక ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయనేది ఈ సినిమాలో కీల పాయింట్.
వరుణ్ ఆండీ క్యారెక్టర్ రిచ్ కిడ్. సమాజంలో పలుకుబడి ఉన్నవారి వారసుడిగా కనిపిస్తాడు. ఎవరికీ భయపడడు.తలకు రంగు, చెవికి పోగు, సిగరెట్ తాగి నల్లబడిన పెదాలు..ఇలా వరుణ్ లుక్ కొత్తగా ట్రై చేసాము. హెయిర్ కోసం రియల్ కలర్ వేసుకుని వాడారు. అవన్నీ ఎందుకు అనే జస్టిఫికేషన్ కూడా ఈ క్యారెక్టర్ కు ఉంటుంది. నా దృష్టిలో సస్పెన్స్ థ్రిల్లర్స్ బెలూన్ లాంటివి. దానికి ఏదైనా కాంటెంపరరీ ఇష్యూ జోడించడం గాలి నింపడం లాంటిది. అప్పుడే ఆ బెలూన్ కు బరువు ఉంటుందనేదే తన తపన అన్నారు. కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ తర్వాత అలాంటి పది సినిమాలు చేశాను ఎవరు చూడలేదు అని వరుణ్ అన్నారు. ఈరోజు ప్రేక్షకులకు ఏదైనా కొత్తగా కావాలి. మన సినిమా బాగుంటే అలాంటివి మరో పది వస్తాయని మాలో ఆత్మ విశ్వాసం నింపారు.
'విరాజి' సినిమా ప్రివ్యూ చూసి వరుణ్ సందేశ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా మీకూ నాకూ లైఫ్ ఇస్తుందని ఆయన ప్రశంసించడాన్ని మరిచిపోలేను. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం చేసిన చిత్రమిది. థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ కలుగుతుంది. నేను శంకర్ గారు చేసిన భారతీయుడు సినిమా చూసి సర్ ప్రైజ్ అయ్యా. ఒక సమస్యను ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాలనే ఆ రోజే ఇన్స్ పైర్ అయ్యాను. నా కెరీర్ లో అలాంటి మంచి పర్పస్ ఫుల్ సినిమాలు చేయాలని అనుకుంటున్నాను.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter