Gold Price: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం, వెండి ధరలు గత కొన్నాళ్లుగా తగ్గుతూ వచ్చాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత కనివినీ ఎరగని రీతిలో పతనమయ్యాయి. దీంతో కొనుగోలు దారులు జ్యువెల్లరీ షాపుల వైపు పరుగులు తీశారు. బంగారం ధర రూ 65వేలకు పతనమవుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే గత 9రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు ( జులై 27 శనివారం) ఒక్కసారి పెరిగి అందరికీ షాకిచ్చింది. వచ్చేది శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలుకు ఇదే సరైన సమయంగా భావించారు పసిడిప్రియులు. నిన్నమొన్నటి వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు పెరిగే సరికి..కొనాలా?వద్దా?అనే ఆలోచనలో పడ్డారు. మరి ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దామా?
దేశంలో పసిడి, వెండి ధరలకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 70, 230 ఉండగా..శనివారం నాటికి రూ. 597 పెరిగి రూ. 70, 836కు చేరింది. శుక్రవారం కిలో వెండి ధర రూ. 83, 726 ఉండగా..శనివారం నాటికి రూ. 245 పెరిగి రూ. 83,971కి చేరింది.
హైదరాబాద్:
హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 70, 836గా ఉంది. కిలో వెండి రూ. 83,971 ఉంది.
విజయవాడ:
విజయవాడలో 10 గ్రాముల గోల్డ్ ధర రూ.రూ.70,836గా ఉండగా..కిలో వెండి ధర రూ.83,971గా ఉంది.
విశాఖపట్నం:
విశాఖపట్నంలో పది గ్రాముల పుత్తడి ధర రూ.రూ.70,836గా ట్రెడ్ అవుతుండగా.. కిలో వెండి ధర రూ.83,971 పలుకుతోంది.
బంగారం స్వచ్ఛతను ఎలా చెక్ చేయాలి?
సాధారణంగా బంగారు ఆభరణాలను తయారు చేయడానికి 22 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు. అయితే 22 క్యారెట్ల బంగారంలో 91.66 శాతం బంగారం ఉంటుందన్న విషయం తెలుసుకోవాలి. అలాగే 2 క్యారెట్ల ఇతర లోహాలు ఇందులో ఉపయోగిస్తారు.అందుకే చాలా మంది హాల్‌మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఈ బంగారం ప్యూరిటీ ఉంటుంది. ఆభరణాలలో స్వచ్ఛతకు సంబంధించి 5 రకాల హాల్‌మార్క్‌లు ఉన్నాయి. ఈ హాల్‌మార్క్‌లు ఆభరణాలపై ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook