Ysrcp Macherla ex mla pinnelli ramakrishna reddy arrested evm damage case: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ మాచర్లలో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్ లో ప్రవేశించి ఈవీఎంలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా.. అక్కడే ఉన్న టీడీపీ ఏజెంట్ పై దాడికి కూడా పాల్పడ్డారు. ఈ ఘటనలో పిన్నేల్లి గతంలో హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈక్రమంలో తాజాగా, హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో పల్నాడు పోలీసులు మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పిన్నెల్లిని పోలీసులు.. నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం కోర్టుకు హజరుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 4 కేసుల్లో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
Read more: Pythons: కొండ చిలువలు ఒక మనిషిని ఎంత సేపట్లో మింగేస్తాయో తెలుసా..?
ఇదిలా ఉండగా.. ఈవీఎం పగలగొట్టిన మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకొవచ్చు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టారు. అదే విధంగా టీడీపీ ఏజెంట్ పై కూడా తన అనుచరులతో దాడికి యత్నించారు. ఈ కేసులో రామకృష్ణా రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. హత్యాయత్నం కేసులు రెండింటిలో ఇప్పటివరకు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.
తాజాగా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్‌లో పిటిషన్లు వేశారు. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోరగా కోర్టు తిరస్కరించింది. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదయింది. కారంపూడిలో దాడి కేసులో సీఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిన్నెల్లి బ్రదర్స్‌పై మరో హత్యాయత్నం కేసు నమోదయినట్లు సమాచారం. ఇవి కాకుండా ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో మరో కేసు నమోదయింది. మొత్తం నాలుగు కేసులు ఆయనపై ఉన్నాయి.
ఈ నాలుగు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్లు వేశారు. గతంలో ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఈ మధ్యంతర బెయిల్‌పై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో హైకోర్ట్ మధ్యంతర బెయిల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో పిన్నెల్లి పిటిషన్లుపై గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరింది. కాగా మధ్యంతర బెయిల్ పిటిషన్లు కొట్టివేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇవాళ (బుధవారం) పోలీసులు అరెస్టు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి