Sudha murty: అబ్దుల్ కలాంఫోన్ చేస్తే.. రాంగ్ నంబర్ అని చెప్పా.. వైరల్ గా మారిన ఎంపీ సుధామూర్తి వ్యాఖ్యలు..

Sudha murty: రాజ్య సభ ఎంపీ సుధామూర్తి ఒకసారి తనకు.. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. అంతేకాకుండా.. ఆ సమయంలో తాను రాంగ్ కాల్ అని చెప్పినట్లు అప్పటి విషయంను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 26, 2024, 01:24 PM IST
  • సుధామూర్తికి ఫోన్ కాల్ చేసిన మాజీ రాష్ట్రపతి..
  • అప్పటి విషయాలను ఎక్స్ వేదికగా పంచుకున్న ఎంపీ..
Sudha murty: అబ్దుల్ కలాంఫోన్ చేస్తే.. రాంగ్ నంబర్ అని చెప్పా.. వైరల్ గా మారిన ఎంపీ సుధామూర్తి  వ్యాఖ్యలు..

wrong number Sudha murty recalls heartwarming phone call from kalam: రాజ్యసభ ఎంపీ సుధామూర్తి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.ఇటు తన విధులు నిర్వర్తిస్తునే, మరోవైపు సమాజంలో జరిగే విషయాలపై కూడా తనదైన స్టైల్ లో స్పందిస్తునే ఉంటారు.  ఈ నేపథ్యంలో తాజాగా, ఎంపీ సుధామూర్తి గతంలో ఒక ఫోన్ గురించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. గతంలో మాజీ రాష్ట్రపతి కలాం నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, కాల్ ఆపరేటర్ చెప్పారు.

 

కానీ ఆయన నాకు పరిచయం లేకపోవడంతో తాను రాంగ్ నంబర్ అని చెప్పానని అన్నారు. తన భర్త నారాయణ మూర్తి కోసం కాల్ చేయబోయి.. పొరపాటున తనకు కాల్ కనెక్ట్ అయ్యిందేమోనంటూ  వ్యాఖ్యలు చేశారు. కానీ మరల సుధామూర్తి.. కాల్ చేసి తనతో మాట్లాడాలని అనుకున్నట్లు చెప్పారని అప్పటి విషయంను గుర్తుచేసుకున్నారు. తాను.. గతంలో రాసిన ఐటీ డివైడ్ అనే అంశంపై రాసిన కాలమ్ ను అబ్దుల్ కలాంగారు చదివారని, అది బాగుందని కంగ్రాట్స్ చేప్పడానికి కాల్ చేశారని, నాటి సంగతిని సుధామూర్తి మరల గుర్తుచేసుకున్నారు.

ఇదిలా ఉండగా.. సుధామూర్తి రచయిత్రిగా అనేక నవలలు,పుస్తకాలు రాశారు. సాహిత్యంలో ఆమె అందించిన సేవలకు గాను.. సాహిత్య అకాడమి బాల సాహిత్య పురస్కారం అందుకున్నారు. 2006 లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ తో కేంద్రం సత్కరించింది.  గతంలో కలాంగారి చేతుల మీదుగానే.. సుధామూర్తి పద్మశ్రీ ను పురస్కరం తీసుకున్నారు.

Read more: Canopy burst: వామ్మో.. గాల్లో తెరుచుకున్న విమానం పైకప్పు.. లేడీ పైలేట్ కు భయానక అనుభవం.. వీడియో వైరల్..

ఈ నేపథ్యంలో ఆఫోటోను ఎక్స్ లో పోస్ట్ చేసి, నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News