Allu Arjun Mega Family Controversy: అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్.. కోసం కాకుండా వైఎస్ఆర్సిపి కార్యకర్త శిల్పా రవికి క్యాంపెయిన్.. చేసిన సంగతి అందరికీ గుర్తుంది. కానీ ఆ క్షణం నుంచి మెగా అభిమానులు.. అందరూ అల్లు అర్జున్ కు యాంటీగా మారిపోయారు. ఆరోజు తర్వాత నుంచి.. అల్లు అర్జున్ మీద మెగా అభిమానులు.. తీవ్రస్థాయిలో ట్రోల్లింగ్ మొదలుపెట్టేశారు.
దానికి తోడు నాగబాబు కూడా అల్లు అర్జున్ మీద ఇన్ డైరెక్టుగా కౌంటర్లు వేయడం, సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేయడం లాంటివి.. అల్లు అర్జున్ మీద పెరిగిపోతూ ఉన్న నెగెటివిటీకి.. మరింత ఆద్యం పోశాయి. అయితే ఎన్నికలకి ముందు..ఈ ట్రోలింగ్ మొదలైంది. ఇప్పుడు ఎన్నికలు పూర్తయిపోయాయి. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో.. గెలిచారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా.. ప్రమాణ స్వీకారం కూడా చేసారు. తర్వాత కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి.
తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ మీద..ట్రోలింగ్ మరింత ఎక్కువగా మారిపోయింది. ఒక వ్యక్తి ఏకంగా.. అల్లు అర్జున్ మీద ఒక గేమ్ డిజైన్.. చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అల్లు అర్జున్ ఫేస్ ఆ గేమ్ లో వాడి దానిని సోషల్ మీడియాలో.. కూడా పోస్ట్ చేశాడు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో గుప్పుమంది.
ఏదేమైనా అల్లు అర్జున్ కూడా తెలుగులో ఒక స్టార్ హీరో. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ.. అల్లు అర్జున్ తమ స్వయంకృషితో.. స్టైలిష్ స్టార్ గా ఎదిగారు. తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో.. కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్ నుంచి నేషనల్ అవార్డు.. అందుకున్న మొట్టమొదటి హీరో అల్లు అర్జున్. అలాంటి హీరోని ఇన్నాళ్ళ పాటు.. ఈ రేంజ్ లో ట్రోల్ చేయడం ఎంతవరకు న్యాయమని బన్నీ ఫాన్స్ వాపోతున్నారు.
మరోవైపు సినిమాలపరంగా చూస్తే.. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా డిసెంబర్ 6న.. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. పుష్ప: ది రైజ్ సినిమాకి రెండవ భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో
Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి