Weight Loss Diet In Summer: ప్రస్తుతకాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్యలో అధిక బరువు సమస్య ఒకటి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది వ్యాయామాలు, మందులు, ప్రొడెట్స్, చికిత్సలు పొందుతారు. అయినప్పటికీ వారి బరువు మరితం పెరగడం తప్ప తగ్గడం ఉండదు. అయితే అధిక బరువు తగ్గాలి అనుకొనేవారికి వేసవికాలంలో ఎంతో సరైనదని చెప్పవచ్చు. ఈ సీజన్లో ఆహారాన్ని నియంత్రించవచ్చు. ఇతర మార్పులు చేయవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఏ విధంగా అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు అనేది మనం తెలుసుకుందాం.
సమ్మర్లో పండ్లు, కూరగాయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ముఖ్యంగా పుచ్చకాయ, కీర, దోసకాయ, కూరగాయాలు, పచ్చి ఆకు కూరలు శరీరాకి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల సమ్మర్లో కలిగే డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బరువు తగ్గించడంలోఎంతో సహాయపడుతుంది. ఈ పదార్ధాలను చిరుతిండిగా, స్నాస్గా తీసుకోవచ్చు. వీటితో పాటు ఆహారంలో కొబ్బరి నీటిని కూడా చేర్చుకోవచ్చు.
ఆహారంతో పాటు శారీరక శ్రమ చేయడం చాలా అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఇరువై శాతం బరువు తగ్గవచ్చు. ప్రతిరోజు ఒక గంట పాటు వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుకుగా, ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అలాగే ఆహారం చేసిన తరువాత నడకకు వెళ్లడం చాలా అవసరం. వీటితో పాటు డ్రై ఫూట్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. కొన్ని రకాల డ్రైఫూట్స్ శరీర బరువును నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. తృణధ్యానాలు తీసుకోవడం వల్ల బరువు నియంత్రనలో ఎంతో సహాయపడుతాయి. వీటితో తయారు చేసే పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతాయి. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వేసవిలో జంక్ ఫుడ్, అధిక కొవ్వు, చెక్కర ఉన్న పదార్థాలు కాకుండా త్వరాగా జీర్ణ అయితే పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఆకుకూరల సూప్‌లు తీసుకోవడం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. రాగి జావ వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
ఈ విధంగా పైన చెప్పిన ఆహారపదార్ధాలను తీసుకుంటూ ప్రతిరోజు వాయ్యామనం, ధ్యానం చేయడం వల్ల సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. ఇకపైన అధిక బరువు కోసం ఎలాంటి మందులు, చికిత్సలు పొందాల్సిన అవసరం ఉండదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
Also Read: AP Election Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఈసీ సంచలన నిర్ణయం.. వైన్స్‌కు ఎగబడిన మందుబాబులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter