Jio AirFiber Plans: ఎయిర్ ఫైబర్‌తో 550 ఛానెల్స్ 14 ఓటీటీలు, 1 Gbps స్పీడ్ ఇంటర్నెట్

Jio AirFiber Plans and Tariffs: మొబైల్ నెట్‌వర్క్, బ్రాడ్‌బ్యాండ్ రెండు రంగాల్లోనూ పట్టు నిలుపుకుంటున్న రిలయన్స్ జియో ఇప్పుడు ఎయిర్‌ఫైబర్ సేవలపై దృష్టి సారించింది. మీ ఇంట్లో కొత్తగా వైఫై కనెక్షన్ కోసం చూస్తుంటే జియో ఎయిర్‌ఫైబర్ మంచి ఆప్షన్ కాగలదు. జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ఏమేం లాభాలున్నాయో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 22, 2024, 08:17 AM IST
Jio AirFiber Plans: ఎయిర్ ఫైబర్‌తో 550 ఛానెల్స్ 14 ఓటీటీలు, 1 Gbps స్పీడ్ ఇంటర్నెట్

Jio AirFiber Plans and Tariffs: రిలయన్స్ జియో ప్రారంభించిన ఎయిర్‌ఫైబర్ టెక్నాలజీ క్రమంగా ఆదరణ పెంచుకుంటోంది. కస్టమర్లు జియో ఫైబర్ వైపు మొగ్గుచూపుతున్నారు. అటు కంపెనీ నుంచి కూడా ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. ఇందులో రెండు ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఏ ప్లాన్ టారిఫ్ ఎంత, ఏయే ప్రయోజనాలున్నాయో పరిశీలిద్దాం.

రిలయన్స్ జియో ఎయిర్‌ఫైబర్‌లో రెండు ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి ఎయిర్‌ఫైబర్, రెండవది ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ లభిస్తుంది. జియో ఎయిర్‌ఫైబర్ అనేది వైర్‌లెస్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. ఎయిర్ ఫైబర్‌తో 1.5 జీబీపీఎస్ స్పీడ్ వరకూ ఇంటర్నెట్ పొందవచ్చు. 2023 సెప్టెంబర్ నెలలో లాంచ్ అయిన జియో ఎయిర్‌ఫైబర్ క్రమంగా దేశంలోని దాదాపు అన్ని పట్టణాలు, నగరాలకు విస్తరించింది. దీనిద్వారా కస్టమర్లకు అంతరాయం లేని 5జి నెట్‌వర్క్ వేగంగా అందుతుంది. ఫైబర్ ఆప్టిక్స్ కాకుండా శాటిలైట్ కనెక్టివిటీ సహాయంతో పనిచేస్తుంది. జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. 

ఎయిర్‌ఫైబర్ ప్లాన్

మొత్తం మూడు ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి 599 రూపాయలు, 899 రూపాయలు, 1199 రూపాయల ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ అన్నీ ఒక నెల వ్యాలిడిటీ కలిగి ఉంటాయి. 100 ఎంబీపీఎస్ వరకూ హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తాయి. అంతేకాకుండా  550 డిజిటల్ ఛానెల్స్, 14 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. ఇందులో 1199 రూపాయల ప్లాన్ అయితే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రైమ్ సభ్యత్వం కూడా ఉచితంగా అందుతుంది. 

ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్ ప్లాన్

ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించవారికి ఇది మంచి ఆప్షన్. ఎయిర్‌ఫైబర్ మ్యాక్స్‌లో కూడా మూడు ప్లాన్స్ ఉన్నాయి. అవి వరుసగా 1499 రూపాయలు, 2499 రూపాయలు, 3999 రూపాయల ప్లాన్స్. ఈ ప్లాన్స్ తీసుకుంటే మీకు ఏకంగా 1 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ఉంటుంది. దాంతోపాటు 550 డిజిటల్ ఛానెల్స్, 14 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా లభిస్తాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కూడా కావాలంటే ఈ ప్లాన్స్ మంచి ఆప్షన్ కాగలవు. 

ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ కావాలంటే ఏం చేయాలి

జియో వెబ్‌సైట్, మై జియో యాప్ ద్వారా కనెక్షన్ బుక్ చేయవచ్చు లేదా జియో కస్టమర్ సపోర్ట్‌కు సంప్రదించవచ్చు. ముందుగా మీ ప్రాంతంలో జియో ఎయిర్‌ఫైబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎయిర్‌ఫైబర్ ఉంటే మాత్రం 60008 60008 నెంబర్ డయల్ చేయండి. లేదా మై జియో యాప్ లేదా సమీపంలోని జియో స్టోర్ సంప్రదించవచ్చు. అడిగిన సమాచారం అందిస్తే జియో సిబ్బంది మీ ఇంటికి లేదా ఆఫీసుకు వచ్చి మిగిలిన ప్రక్రియ పూర్తి చేస్తారు. మీకు అందించే జియో ఎయిర్‌ఫైబర్ ప్యాకేజ్‌లో వైఫై రౌటర్, 4కే స్మార్ట్ సెటప్ బాక్స్,  వాయిస్ యాక్టివేటెడ్ రిమోట్, అవుట్ డోర్ యూనిట్ ఉంటాయి.

Also read: IT Return Tips: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ పొరపాట్లు చేయవద్దు లేకపోతే చట్టపరమైన చర్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News