Station Master Dozes Off: గుర్రుపెట్టి పడుకున్న స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ కోసం లోకోపైలేట్ తంటాలు.. ఎక్కడో తెలుసా..?

Station Master Dozes Off: పట్నాకోటా ఎక్స్ ప్రెస్ రైల్వేస్టేషన్ ఉడిమోర్ స్టాప్ లో ఆగింది. అక్కడ సిగ్నల్ కోసం లోకోపైలేట్ వెయిట్ చేస్తున్నాడు. ఎంత సేపు చూసిన కూడా స్టేషన్ మాస్టర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడంలేదు. దీంతో పలుమార్లు రైల్వే హరన్ మోగించాడు. అయిన కూడా ఎలాంటి ఉలుకు, పలుకులేదు. 

Written by - Inamdar Paresh | Last Updated : May 5, 2024, 12:52 PM IST
  • డ్యూటీలో గుర్రుగా పడుకున్న స్టేషన్ మాస్టర్..
  • అసహానం వ్యక్తం చేసిన ప్రయాణికులు..
Station Master Dozes Off: గుర్రుపెట్టి పడుకున్న స్టేషన్ మాస్టర్.. సిగ్నల్ కోసం లోకోపైలేట్ తంటాలు.. ఎక్కడో తెలుసా..?

Patna kota express udimore station master dozes off on duty near uttar pradesh: కొన్నిసార్లు రైల్వేలో ప్రయాణిస్తున్నప్పుడు అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. ఒక స్టాప్ లో ఆగాల్సిన ట్రైన్ మరో స్టాప్ లో ఆగుతుంది. రైలు లేటు అయిపోయిందని, ఎక్కేటప్పుడు కాలుజారి కిందపడిపోతుంటారు.  మరికొన్నిసార్లు ట్రైన్ లో సీటు దొరక్క నానా తంటాలు పడుతుంటారు. మనం రిజర్వేషన్ చేసుకున్న సీటులో ఎవరో వచ్చి కూర్చుంటారు. కొన్నిసార్లు టీటీ తో టికెట్ , సీటు విషయంలో గొడవలు పడుతుంటారు. ట్రైన్ లో మంచి ఫుడ్ ఉండదు. బాత్రూమ్ లో నీళ్లు రావు. ఇలాంటి సమస్యలు తరచుగా చూస్తుంటాం. కొన్నిసార్లు లోకో పైలేట్లు, టీటీలు.. టిఫిన్ ల కోసం, టీలు, గప్ చుప్ ల కోసం ట్రైన్ లను ఆపిన ఘటనలు కూడా గతంలో వార్తలలో నిలిచాయి.

Read More: Agra school Principal: వామ్మో.. లేడీ టీచర్ కు చుక్కలు చూపించిన ప్రిన్సిపాల్.. బట్టలు చింపేసి పిడిగుద్దులు.. వీడియో వైరల్..

అంతేకాకుండా.. స్టేషన్ మాస్టర్ నెగ్లీజెన్సీ వల్ల  కూడా స్టేషన్ లో రైలు ఆగకుండా వెళ్లిపోయిన ఘటనలు వార్తలలో నిలిచాయి. కొన్నిసార్లు రెండు రైళ్లు ఒకే ప్లాట్ ఫామ్ మీదకు వచ్చి, ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఇక్కడ.. ఒక ట్రైన్ కు స్టేషన్ మాస్టర్ గ్రీన్ లైట్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో దాదాపు అరగంట పాటు ప్లాట్ ఫామ్ మీదనే ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఉడిమోర్ జంక్షన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాలు..

ఉత్తర ప్రదేశ్ లోని ఇటావా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉడిమోర్ జంక్షన్ లో పట్నా కోటా ఎక్స్ ప్రెస్ రైలు ఆగింది. ఎంతసేపైన కూడా రైల్వే స్టేషన్ మాస్టర్ పచ్చజెండా ఊపడంలేదు. రైలు కదలాలంటే.. గ్రీన్ అలర్ట్ ఇవ్వడం తప్పనిసరి. లోకోపైలేట్ చాలా సేపు వేచిచూశాడు. అంతేకాకుండా పలుమార్లు హరన్ కూడా మోగించాడు. దాదాపు అరగంట అయిపోయింది. దీంతో అక్కడ ఉన్న ఇతరులను అలర్ట్ చేశాడు. అప్పుడు స్టేషన్ మాస్టర్ మంచి నిద్రలో ఉన్నట్లు గుర్తించారు.

Read More: Wife On Rent: అంగట్లో బొమ్మలు.. ఈ ఆడోళ్లు.. రూ. 10 భార్యలను అద్దెకు ఇస్తారు.. మన దేశంలోనే ఎక్కడో తెలుసా?

వెంటనే నిద్రలేచిర ట్రైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రయాణికులు కూడా తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. ఘటనపై లోకోపైలేట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశాడు. రంగంలోకి దిగిన అధికారులు వెంటనే సదరు స్టేషన్ మాస్టర్ కు ఘటనపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారిచేసినట్లు సమాచారం. ఈ క్రమంలో.. ఆయన ఇది అనుకోకుండా జరిగిందని, కావాలని విధుల్లో నెగ్లీజెన్సీగా ఉండలేదని కూడా ఆయన వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News