Indigestion in Summer: వేసవికాలంలో ఇవి ఎక్కువగా తింటున్నారా? అయితే మీకు సమస్యలు తప్పవు..

Summer Digestive Issues: ఈ వేసవికాలంలో.. రోజు రోజుకి ఉష్ణోగ్రత పెరుగుతున్న సమయంలో.. జీర్ణానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ఉత్తమం. మరి అవి ఏవో ఒకసారి తెలుసుకుందాం.. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 3, 2024, 08:50 AM IST
Indigestion in Summer: వేసవికాలంలో ఇవి ఎక్కువగా తింటున్నారా? అయితే మీకు సమస్యలు తప్పవు..

Summer Digestion : వేసవికాలం మళ్ళీ వచ్చేసింది. ఈసారి ఇంకా పెరిగిపోయిన ఎండలు.. ప్రజలను భయపెడుతున్నాయి. కాసేపు ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలన్నా కూడా కుదరని పరిస్థితి అయిపోయింది. ఒకవైపు ఎండలు చూస్తే మండిపోతున్నాయి. మరోవైపు వేసవికాలం ఆరోగ్య సమస్యలు కూడా వెంటపడుతూనే ఉన్నాయి. 

ముఖ్యంగా వేసవిలో చాలామంది ఎదుర్కొనేది జీర్ణ సంబంధిత సమస్యలు. మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోవడంతో గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ వంటి ఇబ్బందులు రావడం.. చాలా వరకు వేసవికాలంలోనే జరుగుతాయి. అసలు జీర్ణ సంబంధిత సమస్యలు వేసవికాలంలోఎందుకు వస్తాయో.. రాకుండా ఉండడానికి ఏం చేయాలో అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వేసవికాలం అస్సలు తీసుకోకూడని పదార్థాలు:

టీ, కాఫీ:
వేసవికాలంలో టీ కాఫీలు ఎక్కువగా తాగకూడదు. అవి మన శరీరంలోని ఉష్ణోగ్రతను బాగా పెంచుతాయి. దానివల్ల మన శరీరం డిహైడ్రేట్ అయిపోతుంది. కాబట్టి వీలైనంతవరకు వేసవికాలంలో టీ, కాఫీలకి దూరంగా ఉంటే మంచిది. 

మసాలా ఫుడ్:

మసాలాలు కూడా ఎక్కువగా తినకూడదు. మసాలాల వల్లే పొట్టసంబంధిత సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గ్యాస్,ఎసిడిటీ వంటివి మసాలా ఫుడ్ తీసుకునే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే కనీసం వేసవికాలంలో అయినా.. ఎక్కువ మసాలాలు ఉండే ఆహారానికి దూరంగా ఉంటే మంచిది.

చక్కెర:

ఎంత తీపి ఇష్టం ఉన్నా కూడా చక్కెర మితంగానే తీసుకోవాలి. ముఖ్యంగా సమ్మర్ లో వేడి తట్టుకోలేక బయట కూల్ డ్రింక్స్ తాగడం మానేయాలి. వీలైనంతవరకూ వేసవికాలంలో ఎక్కువ చక్కర లేని ఆహారం తీసుకోవడం మంచిది. 

ఆల్కహాల్:

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మన శరీరం బాగా డిహైడ్రేట్ అయిపోతుంది. అసలే వేసవికాలం కాబట్టి మందుబాబులు కూడా కొద్ది రోజులు మందుకి దూరంగా ఉంటే మంచిది. 

మాంసాహారం:

మామూలుగా కూడా మాంసాహారం ఆలస్యంగా జీర్ణం అవుతుంది అని అందరికీ తెలిసిందే. వేసవికాలంలో కూడా అదే జరుగుతుంది. మాంసాహారం అసలే హెవీ ఫుడ్ కాబట్టి.. గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 

ఇలా వీలైనంతవరకు ఇలాంటి వేడి చేసే ఆహారానికి దూరంగా ఉంటే.. వేసవికాలం వల్ల వచ్చే ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకోవచ్చు.

Also Read: KCR Ban: కేసీఆర్‌కు ఎన్నికల సంఘం ఝలక్‌.. 48 గంటల పాటు ప్రచారం నిషేధం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News