భువనేశ్వర్: ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో నవంబర్ 29 నుంచి పురుషుల హాకీ వరల్డ్ కప్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో భువనేశ్వర్‌కే చెందిన ఎల్ ఈశ్వర్ రావు అనే కళాకారుడు రెండు మినీ హాకీ వరల్డ్ కప్ ట్రోఫీలను రూపొందించారు. అందులో ఒకటి గ్లాస్ బాటిల్‌లో ఇమిడిపోయేది కాగా మరొకటి పెన్సిల్‌పైనే ట్రోఫీ ఆకృతిని చెక్కారు. గ్లాస్ బాటిల్‌లో రూపొందించిన ట్రోఫీ కింది భాగంలో హాకీ వరల్డ్ కప్ 2018 టైటిల్‌ని 'హెచ్‌డబ్ల్యూసీ 2018' అనే సంక్షిప్త రూపంలో చూడవచ్చు.
Odisha: L Eswar Rao, a miniature artist from Bhubaneswar's Jatni, has made a miniature model of men's Hockey World Cup trophy inside a glass bottle & on a pencil nib. #HockeyWorldCup2018 pic.twitter.com/6YJfFtZesV
— ANI (@ANI) December 1, 2018
పెన్సిల్‌పై, గ్లాస్ బాటిల్‌లో పట్టే మినీ హాకీ వరల్డ్ కప్ ట్రోఫీ