Ice Water Facial Benefits: ఇటీవల కాలంలో చాలా మంది అందంగా కనిపించడానికి ఐస్ వాటర్ ఫేషియల్ ను ఉపయోగిస్తున్నారు. మేకప్ వేసుకొనే ముందు ఈ ఫేషియల్‌ను ఉపయోగిస్తారు. ప్రస్తుతం కొందరు బాలీవుడ్ నటులు కూడా సైతం దీని ఉపయోగిస్తుంటారు.
ఐస్ వాటర్ ఫేషియల్ అంటే ఏంటి?
ఈ ఐస్ వాటర్ ఫేషియల్ కోసం ముందుగా ఒక బౌల్‌లో ఐస్ ముక్కలు తీసుకోవాలి. ఇందులోకి కొన్ని చల్లని వాటర్ పోసుకోవాలి. ఐస్ కాస్త కరిగాక ముఖంను అందులో కొన్ని సెకన్ల పాలు ఉంచి బయటకు తీయాలి. ఈ విధనంగా చేయడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చు.
అంతేకాకుండా ఎరుపు దనాని తొలగించడంలో కూడా ఈ ఐస్ వాటర్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చర్మానికి రక్త ప్రవాహం కొనసాగుతుంది. ఈ ఐస్ వాటర్ వల్ల అండర్ ఐ బ్యాగ్య్, కళ్ల ఉబ్బరం తగ్గుతుంది. ముఖంపై ఎరుపు , దురద , చికాకు వంటి సమస్యలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఐస్ వాటర్ వల్ల కొన్ని చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖంపై వాపు కలిగినప్పుడు ఈ ఐస్ వాటర్ సహాయపడుతుంది. చర్మంపై రంధ్రాలకును మాయం చేయడంలో కూడా ఈ ఐస్ వాటర్ సహాయపడుతుంది. ఐస్ వాటర్ చర్మంను సున్నితంగా తయారు చేస్తుంది. ఐస్ వాటర్ చర్మానికి రక్త ప్రసరణను పెంచుతుంది చర్మాన్ని లోపల నుంచి హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. దీని వల్ల చర్మం తాజాగా, మృదువుగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
ఐస్ వాటర్ ఫేషియల్ ఎలా చేయాలి:
మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి పొడిగా తుడవండి.
ఒక గిన్నెలో చల్లటి నీటిని నింపి, కొన్ని ఐస్ క్యూబ్స్ వేయండి.
మీ ముఖాన్ని ఒక శుభ్రమైన తువ్వాలుతో తడిపి, చల్లటి నీటిలో ముంచి, మీ ముఖంపై 5-10 నిమిషాలు ఉంచండి.
మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి మీకు ఇష్టమైన మాయిశ్చరైజర్ తో ముఖంపై రాసుకోండి.
ఐస్‌వాటర్‌ను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు:
చర్మానికి చాలా చల్లగా ఉండే ఐస్‌వాటర్‌ను ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతింటుంది.
ఐస్‌వాటర్‌ను చాలా సేపు ఉపయోగించడం వల్ల చర్మం రక్త ప్రవాహం తగ్గుతుంది.
మీకు ఏవైనా చర్మ సమస్యలు ఉంటే, ఐస్‌వాటర్‌ను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించండి.
గమనిక:
ఐస్‌వాటర్ చర్మానికి ఉపయోగించడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే మీరు ఈ ఫెషియల్‌ను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి