Delhi Protest Video: ఢిల్లీలో హైటెన్షన్.. భారీగా చేరుకుంటున్న రైతులు.. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్..

Farmers Protest: న్యాయమైన తమ డిమాండ్ లను వెంటనే పరిష్కరించాలని ఢిల్లీలో రైతులు నిరసనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ లోని రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకుంటున్నారు. పోలీసులు కూడా ఎక్కడిక్కడ బారికెట్లను, సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేశారు. రైతుల నిరసనలు ఉద్రిక్తతకు దారితీయకుండా చర్యలు చేపట్టారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 13, 2024, 11:51 AM IST
  • - ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన రైతులు..
    - కిలో మీటర్ల ట్రాఫిక్ జామ్ తో సామాన్యలు ఇబ్బందులు..
Delhi Protest Video: ఢిల్లీలో హైటెన్షన్.. భారీగా చేరుకుంటున్న రైతులు.. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్..

Chalo Delhi Farmers Protest March: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి రైతులు నిరసనలతో అట్టుడికిపోతుంది. ఇప్పటికే ఢిల్లీని భద్రత వలయంగా మారిపోయింది. రైతులు ఈరోజు ఢిల్లీలో నిరసనలకు పిలుపు నిచ్చారు. దీని కోసం భారీగా పంజాబ్, ఉత్తర ప్రదేశ్, హర్యానాల నుంచి రైతులు కదం తొక్కారు. దీంతో అనేక ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాధారణ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. 

 

ఢిల్లీ ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాతో కలిపే ఘాజీపూర్,  చిల్లా సరిహద్దుల్లోని హైవేలపై వందల కొద్ది వాహనాలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి.  DND ఫ్లైఓవర్‌పై ఇరుక్కున్న ఒక ప్రయాణీకుడు స్థానిక మీడియాతో  మాట్లాడుతూ.. ఒక గంటకు పైగా ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

కేవంలో ఒక గంటకు ఒక కిలోమీటరు మాత్రమే ప్రయాణిస్తున్నట్లు తెలిపాడు. ముందు వైపు రోడ్డు పూర్తిగా బ్లాక్‌గా ఉంది. అదే విధంగా  యు-టర్న్ చేసుకొవడానికి కూడా అవకాశం లేదని తెలిపాడు. అదే విధంగా.. ఘాజీపూర్, సింగు,  టిక్రితో సహా పలు సరిహద్దు పాయింట్లు ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిరసన తెలిపే రైతులను నిరోధించడానికి పటిష్టంగా బందోబస్తు చర్యలు చేపట్టారు. సరిహద్దు పాయింట్ల మీదుగా ట్రాక్టర్లు,  ట్రాలీలు వెళ్లకుండా నిరోధించడానికి హైవేలపై కాంక్రీట్ బ్లాక్‌లు,  బారికేడ్‌ల పొరలు ఏర్పాటు చేయబడ్డాయి. రోడ్లపై ముళ్ల తీగలు, గోర్లు కూడా ఏర్పాటు చేశారు.

గత రాత్రి రైతులు ప్రభుత్వ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు. అయితే వారి చర్చలు మాత్రం సఫలం కాలేదు.  మూడు కీలక డిమాండ్లపై ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం.  -కనీస మద్దతు ధర (MSP) హమీ ఇవ్వటానికి కూడా ప్రభుత్వం ముందుకు రాలేదని తెలుస్తోంది. గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ఢిల్లీలోకి ప్రవేశించకుండా గూడ్స్ వాహనాల ప్రవేశాన్ని అధికారులు నిషేధించారు.  

Read More: Baby - Valentines Day: వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14 థియేటర్స్‌లో రీ రిలీజ్ అవుతున్న కల్ట్ బ్లాక్ బస్టర్ 'బేబి'..

ఇదిలా ఉండగా.. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తాజా ట్రాఫిక్ మార్గదర్శకాలలో జారీచేశారు.. 

- గూడ్స్ వాహనాలు హర్యానాలోని సిర్సా,  ఉత్తరప్రదేశ్‌లోని సూరజ్‌పూర్ మధ్య పారిచౌక్ మీదుగా ప్రయాణించడానికి కూడా అనుమతించబడదు.

- డిఎన్‌డి సరిహద్దు నుండి ఢిల్లీకి వెళ్లే వారు ఫిల్మ్ సిటీ నుండి సెక్టార్ 18 మీదుగా ఎలివేటెడ్ రోడ్డులో వెళ్లాలని సూచించారు. చిల్లా వైపు నుండి ప్రయాణికులు సెక్టార్ 14A ఫ్లైఓవర్, రౌండ్‌అబౌట్ చౌక్, సెక్టార్ 15 నుండి సందీప్ పేపర్ మిల్ చౌక్, జుందాపురా చౌక్ మీదుగా వెళ్లవచ్చు.

- కాళింది కుంజ్ బోర్డర్ నుండి ఢిల్లీకి ప్రయాణించడానికి ప్రజలు తప్పనిసరిగా మహామాయ ఫ్లైఓవర్‌ను తీసుకోవాలి. యమునా ఎక్స్‌ప్రెస్‌వేని ఉపయోగిస్తున్నప్పుడు, ప్రయాణికులు జెవార్ టోల్ నుండి ఖుర్జా వైపు దిగి జహంగీర్‌పూర్ మార్గంలో వెళ్లాలని సూచించారు.

- యమునా ఎక్స్‌ప్రెస్‌వేని ఉపయోగించి ఢిల్లీకి వెళ్లడం: జేవార్ టోల్ నుండి ఖుర్జా వైపు దిగి జహంగీర్‌పూర్ మీదుగా వెళ్లండి.
తూర్పు పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే నుండి దిగిన తర్వాత సిర్సా, పారి చౌక్ మీదుగా ఢిల్లీకి వెళ్లడం: సిర్సా వద్ద దిగలేము; దాద్రీ, దాస్నా మీదుగా వెళ్లండి.

- సిర్సాలో, ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల నుండి వచ్చే మార్గాల్లో వ్యూహాత్మకంగా 40 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.

- పంజాబ్‌లోని భటిండా నుంచి వచ్చే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.

- NH-9 - పంజాబ్, ఢిల్లీ, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ గుండా వెళ్లే జాతీయ రహదారి, ప్రత్యామ్నాయ మార్గాలను అందించడానికి అనేక పాయింట్లపై ట్రాఫిక్ మళ్లించబడింది.

Read More: Life Style: ప్రెగ్నెంట్ సమయంలో మహిళలు ఈ మిస్టెక్స్ అస్సలు చేయోద్దు.. నిపుణుల సూచనలివే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News