Wife Taunts On Husband Income: మీ భర్త ఆదాయం తక్కువగా ఉందా? మీ కాపురం సాగడానికి ఇబ్బందిగా ఉందా? అయితే భర్తతో వాగ్వాదానికి దిగకండి. ఎందుకంటే భర్త ఆదాయం విషయమై గొడవ పడితే మీపై కేసు నమోదయ్యే అవకాశం ఉంది. అంతే కాదు మీ భర్తతో మీకు విడాకులు వచ్చే ప్రమాడం పొంచి ఉంది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇప్పుడు అదే జరగనుంది. ఆర్థిక స్థితిగతిపై భర్తను భార్య అవహేళన చేయడమూ క్రూరత్వమేనని ప్రకటించింది. మానసిక హింసకు గురవుతారని హెచ్చరించింది.
ఆర్థిక స్థితి గురించి భర్తను భార్య తరచుగా ఎత్తిపొడవడం, అవహేళన చేయడం కూడా మానసిక క్రూరత్వం కింద ఢిల్లీ ధర్మాసనం పరిగణించింది. ఇటువంటి క్రూరత్వాన్ని ఎదుర్కొన్న సందర్భాల్లో విడాకులను కోరే హక్కు భర్తకు లభిస్తుందని తెలిపింది. ఆర్థిక స్థోమతకు మించిన కలలను నెరవేర్చమని భర్తపై భార్య ఒత్తిడి చేయడం సరికాదని న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైత్ , నీనా బన్సల్ కృష్ణలతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.
ఆదాయం విషయంలో భార్య వేధింపులను భరించలేక ఓ భర్త విడాకులు మంజూరు చేయాలని ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. తన తల్లిదండ్రుల నుంచి రూ.8 వేలు తీసుకున్న అప్పు విషయమై పదేపదే భర్తను సూటిపోటీ మాటలతో వేధిస్తుండేది. ఈ విషయాలన్నీ విన్న ఫ్యామిలీ కోర్టు ఆ భార్యాభర్తలకు విడాకులు మంజూరుకు అనుమతి ఇచ్చింది. విడాకులు ఇవ్వడంపై బాధిత భార్య ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ పిటిషన్ వేసింది. తాజాగా శనివారం ఈ పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై సురేశ్ కుమార్ ఖైత్, నీనా బన్సల్ కృష్ణతో కూడిన బెంచ్ వాదోపవాదాలు విన్న తర్వాత పై ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా భార్యాభర్తలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. 'అనవసర విషయాలపై రాద్ధాంతం చేస్తూ భర్తపై ఒత్తిడిని పెంచడం భార్యకు సరికాదు. ఈ ప్రభావంతో అసంతృప్తి, ప్రశాంతత కోల్పోతారు. భర్తపై మానసికంగా తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. దాంపత్య జీవితంలో పొందుతున్న వారు తమ అవసరాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని ఢిల్లీ హైకోర్టు సూచించింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల నిర్ణయం సబబేనని పేర్కొంది. సో భార్యలు ఇకపై మీ భర్త సంపాదన ఎంత ఉన్నా కూడా సర్దుకోండి. అంతే కానీ పోట్లాడకండి. కొట్లాడితే, దూషిస్తే భర్తకు కోపమొచ్చి కోర్టును ఆశ్రయిస్తే మాత్రం మీకు విడాకులు ఖాయమే. కాగా ఢిల్లీ హైకోర్టు తీర్పుతో అల్పాదాయ భర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చిందని ఆనందంలో ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి