Nitish kumar: బీహర్ రాజకీయాల్లో కీలకమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం జనతాదళ్ యునైటెడ్ నేత నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీని గద్దె దించడమే టార్గెట్ గా ఇండియా కూటమి ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా, నితీష్ కుమార్ మరల ఆర్జేడీతో విడిపోయి, బీజేపీతో బంధంవైపు అడుగులు వేస్తున్నారు.ఈ క్రమంలోనే నితీష్ కుమార్ రాజీనామాపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లీ కార్జున ఖర్గె స్పందించారు.
నితీష్ నిలకడ లేని మనిషని ఆయన ఖర్గె ఎద్దెవా చేశారు. నితీష్ కుమార్ రాజీనామా చేస్తాడని తమకు ముందే తెలుసన్నారు. "దేశంలో నితీష్ కుమార్ లాంటి.. 'ఆయా రామ్-గయా రామ్' లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారన్నారు. లాలు ప్రసాద్ , తేజస్వీ యాదవ్ లు తమకు ముందే ఈ విషయం చెప్పానని ఖర్గే అన్నారు. నితీష్ కుమార్ యూటర్న్ పాలిటిక్స్ తమకు ముందే తెలుసని, ఇండియా కూటమిలో ఎలాంటి విబేధాలు రాకూడదని దీనిపై వ్యాఖ్యలు చేయలేదని ఖర్గే అన్నారు.
జేడీయూ నేత నితిష్ కుమార్ మరల, బీజేపీ సహాకారంతో మహఘట్ బంధన్ గా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్ అసెంబ్లీలో 243, RJDకి 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు; తర్వాతి స్థానంలో బీజేపీ 78; JD(U)కి 45, కాంగ్రెస్‌కి 19, CPI (M-L)కి 12, CPI(M) మరియు CPIకి 2 చొప్పున, హిందుస్తానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్) 4 వద్ద.. మరో రెండు సీట్లు AIMIMకి ఉన్నాయి.
Read Also: Wedding: ''భర్తలతో విడిపోయిన భార్యలకు గుడ్ న్యూస్..'' కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook