Oil Massage:ప్రస్తుతం ఉన్న ఆహారపుటలవాట్లు జీవనశైలి కారణంగా మనం పలు రకాల సమస్యలతో బాధపడుతున్నాము. వీటిలో చాలామంది ఎక్కువ బాధ పడే సమస్య చర్మం పొడిబారడం, జుట్టు ఎక్కువగా ఊడడం. వీటిని సరిగా ఉంచడం కోసం మార్కెట్లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడుతాము. ఖర్చు విషయం పక్కన పెడితే వీటివల్ల ఆరోగ్యానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువే. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి మన ఇంటి వద్ద సులభంగా దొరికే నూనెలను ఉపయోగించి ఓ చిన్ని చిట్కా చేస్తే సరిపోతుంది.
మనిషి జననం మొదలయ్యేది అమ్మ కడుపులో నాభి నుంచి ఏర్పడే ఒక కనెక్షన్ ద్వారా. నాభి నుంచే పౌష్టికాహారాలు అందుతాయి కాబట్టి గర్భంలో బిడ్డ పెరుగుతాడు. అందుకే మన నాభి మన ఆరోగ్యం వ్యవస్థకు మూల స్తంభం లాంటిది. చాలా రకాల అనారోగ్య సమస్యలు నాభిలో కొన్ని రకాల నూనెలను ఉపయోగించి చిన్న మసాజ్ చేయడం వల్ల సులభంగా తగ్గించుకునే అవకాశం ఉంది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నాభిలో నాలుగు చుక్కల స్వచ్ఛమైన ఆవాల నూనె వేసి రెండు నిమిషాలు మర్దన చేయడం వల్ల పెదవుల పగుళ్లు తగ్గడమే కాకుండా మీ పెదాలు అరవిచ్చిన రోజాలా మాదిరి మృదువుగా మారుతాయి. రెండు చుక్కల కొబ్బరినూనెను నాభిలో వేసి కాసేపు మర్దన చేయడం వల్ల మీ మడమల పగుళ్ల నుంచి పూర్తి ఉపశమనాన్ని పొందుతారు. పొడిబారిన చర్మం ఎక్కువగా ఉన్నవారు రెండు చుక్కల నువ్వుల నూనె నాభిలో వేసి మర్దన చేయడం వల్ల మృదువైన చర్మాన్ని పొందుతారు.
రోజు రాత్రి పడుకునే ముందు మీ నాభిలో రెండు చుక్కల నూనె వేసి మర్దన చేయడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల జుట్టు కు సంబంధించిన సమస్య తగ్గడంతో పాటు మీ కంటి చూపు కూడా మెరుగవుతుంది. అయితే మరుసటి రోజు పొద్దున కచ్చితంగా నాభిలో శుభ్రంగా సబ్బు పెట్టి శుభ్రం చేసుకోవాలి లేకపోతే అక్కడ ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యా అవకాశం ఉంది.
గమనిక :పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించడం జరిగింది.ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
Also Read: Ys Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిబ్రవరి 17న, ప్రకటించిన వైఎస్ షర్మిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter