Vadhuvu:అవికా గోర్.. చిన్నారి పెళ్లికూతురు అనే టీవీ సీరియల్ ద్వారా అందరూ మనసులు దోచుకున్న యాక్టర్. ఉయ్యాల జంపాల అంటూ టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చి అందరి మనసుల్లో ఉయ్యాలలు వేసుకొని ఊగింది. ఆ తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూస్తా మావ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3, 10వ తరగతి డైరీస్, థాంక్యూ లాంటి పలు చిత్రాలలో నటించి మంచి ప్రేక్షక ఆదరణ సంపాదించుకుంది.ప్రస్తుతం ఈమె వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ ఉంది. రీసెంట్ గా విడుదలైన మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్‌లో అవికా నటన అద్భుతంగా ఉంది.
ఇప్పుడు వధువు అనే మరొక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు ఓటీటీ లో రావడానికి సిద్ధంగా ఉంది. మేకర్స్ దీపావళి కానుకగా మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనే క్యాప్షన్ తో ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. టైటిల్ లోనే భారీ ట్విస్ట్ పెట్టడంతో సిరీస్ పై ఆసక్తి నెలకొంది. టైటిల్ తో పాటు పోస్టర్లో ఉన్న అవికా లుక్ గమనిస్తే స్టోరీ లో మంచి డెప్త్ ఉందన్న విషయం అర్థమవుతుంది. పెళ్లికూతురు గెటప్ లో మొహం నిండా ఆవేదన.. కళ్ళనిండా నీళ్లతో.. అవికా ఫేస్ హైలైట్ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ గా ఉంది.
ఇక ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఇంకా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించలేదు. ఈ సిరీస్‌లో అవికా గోర్ తో పాటు బిగ్‌బాస్ ఫేమ్ అలీ రెజా, నందు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కూడా మాన్షన్ 24 సిరీస్ టైపులో మంచి థ్రిల్లర్ జానర్ కి సంబంధించింది. సిరీస్ షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో త్వరలో ఇది స్ట్రీమింగ్ కాబోతున్నట్టు తెలుస్తోంది. అవికా గోర్ చివరిసారిగా నటించిన చిత్రం పాప్కాన్ మూవీ. నాగచైతన్య థాంక్యూ చిత్రంలో కూడా అవికా ఓ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం మాత్రం వరుస వెబ్ సిరీస్ తో బాగా బిజీగా ఉందనిపిస్తుంది.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి