World Cup 2023, AUS vs SL: వన్డే ప్రపంచకప్ లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. సెమీస్ ఆశలు సజీవంగా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆసీస్ గెలిచింది. శ్రీలంక వరుసగా మూడో మ్యాచ్‌లో కూడా ఓడిపోయింది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. దీంతో ప్రపంచకప్ పట్టికలో పాయింట్ల ఖాతాను తెరిచింది కంగరూ జట్టు. నాలుగు వికెట్లు తీసి లంక జట్టును దెబ్బతీసిన జంపాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. లంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సంక (61), కుషాల్ పెరీరా (78) హాఫ్ సెంచరీలతో రాణించారు. చివర్లో చరిత్ అసలంక (25) పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా నాలుగు వికెట్లు తీశాడు. స్టార్క్, కమిన్స్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం ఛేదనను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. లంక పేసర్ దసున్ మధుశనక ఒకే ఓవర్ లో డేవిడ్ వార్నర్ (11), స్టీవ్ స్మిత్(0)ను ఔట్ చేశాడు. మరోవైపు మిచెల్ మార్ష్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అనంతరం లబుషేన్ (40), ఇంగ్లిస్ (58) పరుగులతో రాణించారు. చివర్లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31 నాటౌట్), మార్కస్ స్టోయినిస్ (20 నాటౌట్) అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియా జట్టుకు విజయాన్ని అందించారు. ఇంకా 88 బంతులు ఉండగానే కంగరూ జట్టు విజయాన్ని సాధించింది. 35.2 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు చేసింది.
Also Read: Cricket in Olympics: వందేళ్ల తరువాత 2028లో తిరిగి ఒలింపిక్స్‌లో క్రికెట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..