Israel Palestine War Updates: హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ సైన్యం తమ దాడులు కొనసాగిస్తోంది. శనివారం గాజా సరిహద్దు భాగాలను పేల్చివేసిన సైన్యం.. తాజాగా సరిహద్దుపై పూర్తి నియంత్రణలోకి తెచ్చుకుంది. ఈ మేరకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నత అధికార ప్రతినిధి, రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మంగళవారం మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ భూభాగంలో దాదాపు 1,500 హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపారు. ఉగ్రవాదులెవరూ కంచె గుండా లోపలికి రాలేకపోయారని.. సరిహద్దులో దాక్కున్న ఉగ్రవాదులను గుర్తించి హతమార్చేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన చెప్పారు.
సైన్యం దాడులతో ఇజ్రాయెల్ భూభాగంలో ఉగ్రవాదుల సంఖ్య భారీగా తగ్గిపోయిందని.. చాలా తక్కువ సంఖ్యలో ఉన్నట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో సమాచారం అందిస్తూ.. ఇజ్రాయెల్ వైమానిక దళం ఐడీఎఫ్ గాజా స్ట్రిప్ కంచె సమీపంలో నివాసాలను ఖాళీ చేయడాన్ని పూర్తి చేసిందని తెలిపింది. అత్యవసరమైన మినహా.. మిగిలిన అందరినీ తరలించినట్లు పేర్కొంది. అదేవిధంగా గాజా-ఈజిప్ట్ సరిహద్దు క్రాసింగ్ మూసివేశారు.
ఐడీఎఫ్ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ జోనాథన్ కాన్రికస్ మాట్లాడుతూ.. సరిహద్దులో ఉగ్రవాదుల దాడులను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దీటుగా ఎదుర్కొందని తెలిపారు. లెబనాన్ సరిహద్దులో పదివేల మంది అదనపు దళాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చుట్టుపక్కల ప్రాంతాన్ని క్లియర్ చేయడానికి వారు 35 బెటాలియన్లు, వివిధ రంగాలను పర్యవేక్షిస్తున్న నలుగురు లెఫ్టినెంట్ జనరల్స్, గాజా డివిజన్ కమాండర్‌తో కార్యకలాపాలను నిర్వహించారని చెప్పారు.
ఇజ్రాయెల్ వైమానిక దళం లాజిస్టికల్ లోపాలను పరిష్కరించేందుకు 24/7 వాట్సాప్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆహారం, పరికరాలు, లాజిస్టిక్‌లను వెంటనే డెలివరీని చేసేలా ప్లాన్ రూపొందించారు. ఇజ్రాయెల్ వైమానిక దళం ఫైటర్ జెట్‌లు గాజా స్ట్రిప్‌లోని హమాస్‌కు చెందిన అనేక టెర్రర్ సైట్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు కీలకమైన ప్రాంతాలైన రిమాల్, ఖాన్ యూనిస్ వంటి విస్తృత దాడులు నిర్వహిస్తున్నాయి.
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఖతార్ ఎంటర్ అయింది. ఇజ్రాయెల్ జైళ్లలో నిర్బంధించి 36 మంది పాలస్తీనియన్ మహిళలు, పిల్లలను విడుదల చేయడానికి బదులుగా.. గాజాలో హమాస్ ఉగ్రవాదులు బంధించిన ఇజ్రాయెల్ దేశస్తులను విడుదల చేయడానికి చర్చలు జరిపేందుకు ప్రయత్నించింది. యునైటెడ్ స్టేట్స్‌తో సమన్వయంతో జరిపుతోంది. యుద్ధానికి ముగింపు పలకాలని.. పౌరుల రక్షణ కోసం ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది.
Also Read: India vs Australia Highlights: వన్డే వరల్డ్ కప్‌లో భారత్ బోణీ.. ఆసీస్‌పై ఘన విజయం..
Also Read: World Cup 2023: ఆ టాప్ బ్యాటర్‌కు డెంగ్యూ, పాక్ మ్యాచ్‌కు కూడా దూరమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి