Minister Roja: దత్తపుత్రుడు నోరు అదుపులో పెట్టుకో.. చంద్రబాబు నిప్పు కాదు అవినీతి చేసిన తుప్పు: మంత్రి రోజా

Minister Roja Fires on Pawan Kalyan: టీడీపీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు మంత్రి రోజా. తెలుగుదేశం పార్టీ చేస్తున్న బంద్‌కు ప్రజల నుంచి ఏ మాత్రం స్పందనలేదన్నారు. చంద్రబాబు నిప్పు కాదు అవినీతి చేసిన తుప్పు అంటూ ఎద్దేవా చేశారు.

Written by - Ashok Krindinti | Last Updated : Sep 11, 2023, 03:23 PM IST
Minister Roja: దత్తపుత్రుడు నోరు అదుపులో పెట్టుకో.. చంద్రబాబు నిప్పు కాదు అవినీతి చేసిన తుప్పు: మంత్రి రోజా

Minister Roja Fires on Pawan Kalyan: రూ.241 కోట్లు కొల్లగొట్టి చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయాడని మంత్రి రోజా అన్నారు. ఖైదీ నంబర్ 7691 చంద్రబాబు అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను  ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. ఈ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబు అని.. బోగస్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టే అరెస్ట్ చేశారని.. చంద్రబాబు అవినీతి బురదలో కూరుకుపోయిన ముత్యం అని ఎద్దేవా చేశారు. కక్ష సాధించాలనునుకుంటే  2021 లోనే ఈ కేసు టేకఫ్ చేశారని.. అప్పుడే చేసే వారని అన్నారు. 

"వైఎస్ఆర్ కన్న కలలు నిజం చేయాలని  సీఎం జగన్ సుపరిపాలన అందించారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌ది. సోనియా గాంధీ సూచనతో తెల్ల పేపర్‌పై సంతకం పెట్టించడం కక్ష సాధింపు. ఈ కుంభ కోణంతో సంబంధం లేదని  చంద్రబాబు, ప్రత్యేక విమానంలో తీసుకు వచ్చిన లాయర్ లుధ్రా ఏమైనా మీకు చెప్పరా..? కేంద్రం ప్రభుత్వం ఆదేశంతో ఈ కేసు విచారణ జరుగుతోంది. చంద్రబాబు పీఏ శ్రీనివాస్, లోకేష్ పీఏ కిలారి రాజేష్‌కు సంబధం ఉన్నది వాస్తవం కాదా..? ఐటీ శాఖ 118 కోట్లు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది వాస్తవం కాదా..?

14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు అడ్డంగా దొరికారు. పట్టిసీమ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అవుతారు. జగన్నను జైలు రెడ్డి అన్నారు. ఈరోజు రాజమండ్రి జైలు నాయుడు అని మేము పిలవాలా..? జగన్‌ను సైకో  అన్నా టీడీపీ నాయకులు. అవినీతి సైకో చంద్రబాబు అని మేము అనగలం. టీడీపీ దత్తపుత్రుడు నోరు అదుపులో పెట్టుకో.. త్వరలో లోకేష్, అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తారు. చంద్రబాబు నిప్పు కాదు అవినీతి చేసిన తుప్పు. 
 
టీడీపీ చేస్తున్న బంద్‌కు ప్రజల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. బంద్ నా.. బొందా అని ప్రజలు అనుకుంటున్నారు. నోటుకు ఓటు కేసులో దొరికిపోయిన రోజు 2 లక్షలు కోట్లు హైదారాబాద్‌లో వదిలి వచ్చిన రోజు టీడీపీ బంద్‌కు పిలుపు ఇవ్వాల్సింది. స్కిల్ డెవలపెంట్ స్కామ్‌ను చాలా స్కిల్‌గా దొచేశాడు. అమరావతిలో భూములను దోచుకున్నాడు. పోలవరం, పట్టిసీమ వరకు అవినీతి చేశాడు. ఇలాంటి అవినీతి పరుడిని గెలిపించామా అని కుప్పం ప్రజలు ఈరోజు బాధ పడుతున్నారు.." అని మంత్రి రోజా అన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీ అన్నయ్య చిరంజీవిని ఎయిర్ పోర్ట్‌పై అడ్డుకున్నప్పుడు రోడ్లుపై దోర్ల లేదే అని ప్రశ్నించారు. లండన్‌కు పిల్లలను చూడటానికి వెళ్తే.. దీన్ని కూడా రాజకీయం చేస్తున్నాడు దత్తపుత్రుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. షెల్ కంపెనీల్లో పవన్‌కు కూడా పార్టనర్ షిప్ ఉన్నట్లు ఉందని.. అందుకే రోడ్డుపై దొర్లుతున్నాడని ఎద్దేవా చేశారు.

Also Read: SBI RD Interest Rates: ఎస్‌బీఐ ఆర్‌డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?

Also Read: Health Tips in Telugu: పాలలో ఖర్జూరం మరగబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి తీసుకుంటే..!   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News