TDP-BJP Alliance: టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చేసిన బండి సంజయ్..!

Chandrababu Naidu Amit Shah Meeting: టీడీపీతో బీజేపీ పొత్తు అని వస్తున్న వార్తలు అన్నీ ఊహజనితమేనని కొట్టిపారేశారు బండి సంజయ్. అమిత్‌ షాను చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. వీరు పొత్తులపైనే చర్చించారనేది కరెక్ట్‌ కాదన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 4, 2023, 04:33 PM IST
TDP-BJP Alliance: టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చేసిన బండి సంజయ్..!

Chandrababu Naidu Amit Shah Meeting: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో భేటీ కావడంతో.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పార్టీల మధ్య పొత్తు కన్ఫార్మ్ అయినట్లేనని ప్రచారం ఊపందుకుంది. ఈ భేటీపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధమైందని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని కొట్టిపారేశారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. గతంలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీష్ కుమార్ వంటి ప్రతిపక్ష నేతలను కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. దేశాభివృద్దే బీజేపీ లక్ష్యమని అన్నారు. ఆదివారం ఉదయం వివిధ జిల్లాల నేతలతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 

కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెలాఖరు వరకు జరిగే ‘మహజన్ సంపర్క్ అభియాన్’ కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. గడపగడపకూ బీజేపీ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అందుకోసం కార్యక్రమాలను మరింత ఉధృతం చేయాలన్నారు.

ఈ సందర్భంగా అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు నాయుడు సమావేశమైన నేపథ్యంలో టీడీపీతో బీజేపీ పొత్తుకు సిద్దమైనట్లుగా  వస్తున్న వార్తలపై బండి సంజయ్ స్పందించారు. టీడీపీతో బీజేపీ పొత్తు  ఊహాగానాలేనని కొట్టిపారేశారు. అలాంటి వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ మాదిరిగా ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను కలవకుండా ప్రగతి భవన్‌కే పరిమితమై తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే నైజం బీజేపీది కాదన్నారు. చంద్రబాబుతో పొత్తు గురించి చర్చించారని అనడం ఊహాజనితమేనని వ్యాఖ్యనించారు.

Also Read: Bandla Ganesh: ఇంతకంటే ఏం కావాలి దరిద్రం..చంద్రబాబుపై బండ్ల సంచలనం

తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని.. పార్టీని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా మరికొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాని ఆయన మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలంతా కలిసే పోటీ చేయబోతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలనపట్ల విసిగిపోయారని.. బీజేపీవైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఎఫ్పుడు ఎన్నికలు జరిగినా  కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని జోస్యం చెప్పారు.

Also Read: Odisha Train Tragedy: విండో సీటు కోసం కోచ్ మారిన తండ్రీకూతుళ్లు.. క్షణాల్లో ప్రమాదం.. తర్వాత ఏమైందంటే..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News