Hair Care: స్నానం చేసే ముందు జుట్టుకు వీటిని అప్లై చేస్తే, జుట్టు దృఢంగా మారుతుంది!

Best Hair Care Tips: జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా స్నానం చేసే కంటే ముందు ఈ పదార్థాలను అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు జుట్టు సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని కూడా నియంత్రిస్తుంది.   

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 24, 2023, 10:57 AM IST
Hair Care: స్నానం చేసే ముందు జుట్టుకు వీటిని అప్లై చేస్తే, జుట్టు దృఢంగా మారుతుంది!

Best Hair Care Tips: జుట్టు అందంగా, మృదువుగా, మెరిసేలా ఉంటే ముఖం కూడా అందంగా ఉంటుంది. ప్రస్తుతం చాలా మందిలో వాతావరణంలో తీవ్ర మార్పుల కారణంగా జుట్టు సమస్యలు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా జుట్టు  అందహీనంగా తయారవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా  తలస్నానం చేసే క్రమంలో కూడా పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల జుట్టు అందంగా కూడా తయారవుతుంది. అయితే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు తెలుకుందాం.  

తలస్నానం చేసే ముందు వీటిని తప్పకుండా అప్లై చేయండి:
కొబ్బరి నూనె:

జుట్టు దృఢంగా, ఒత్తుగా మారడానికి జుట్టుకు తప్పకుండా అయిల్స్‌ను అప్లై చేయాల్సి ఉంటుతంది. ఎందుకంటే ప్రతి రోజు జుట్టుకు నూనెను అప్లై చేయడం వల్ల పోషణ లభిస్తుంది. అయితే స్నానం చేయడానికి గంట ముందు ప్రతి రోజు జుట్టుకు గోరువెచ్చని కొబ్బరి నూనెను అప్లై చేసి.. 10 నిమిషాల పాటు మసాజ్‌ చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుంది.

Also read: Insomnia: రోజూ 5 గంటలు కూడా నిద్రపోవడం లేదా, అయితే ఈ ప్రమాదకర సమస్యలు వెంటాడవచ్చు

పెరుగు:
పెరుగులో ఉండే పోషకాలు జుట్టును పొడిబారడాన్ని తగ్గించడమేకాకుండా చాలా రకాల జుట్టు సమస్యలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. స్నానం చేసే ముందు జుట్టుకు పెరుగు అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా, మెరిసేలా తయారవుతుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. కాబట్టి తీవ్ర జుట్టు, స్కాల్ప్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జుట్టుకు పెరుగుతును అప్లై చేయాల్సి ఉంటుంది. 

గుడ్డు:
జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు స్నానానికి 40నిమిషాల ముందు గుడ్డును జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అప్లై చేసే క్రమంలో తప్పకుండా గుడ్డులోని పచ్చ సొనను పక్కన పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇలా అప్లై చేసిన తర్వాత  20 నిమిషాల పాటు జుట్టును ఆరనివ్వాలి. ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత తల స్నానం చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Insomnia: రోజూ 5 గంటలు కూడా నిద్రపోవడం లేదా, అయితే ఈ ప్రమాదకర సమస్యలు వెంటాడవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News