Skin Glow Tips In Summer: పాలతో తయారుచేసిన మీగడ శరీరానికి చాలా మంచిది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు అధిక పరిమాణంలో లభిస్తాయి.. కాబట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది అంతేకాకుండా కండరాల ఉత్పత్తిని పెంచేందుకు కూడా సహాయపడుతుంది. అయితే పాలలోని మీగడ శరీరానికే కాకుండా చర్మాన్ని కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని సంరక్షించడమే కాకుండా చర్మం గ్లోని పెంచేందుకు కూడా సహాయపడతాయి. ముఖ్యంగా మచ్చలు పొడి చర్మం ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి మీగడ మార్కెట్లో లభించే ప్రొడక్ట్స్ కంటే ఎక్కువగా సహాయపడుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. వేసవి కారణంగా వచ్చే చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి మీగడతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఈ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో?.. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మీగడ ఫేస్ ప్యాక్ ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
మూడు చిటికాల పసుపు
నాలుగు టీ స్పూన్ల తాజా మీగడ
ఒక టీ స్పూన్ తేనె
Also Read: Shraddha Das Photos: తళుకుబెళుకుల డ్రెస్సులో కైపెక్కిస్తున్న శ్రద్దా దాస్
ఫేస్ ప్యాక్ తయారీ పద్ధతి:
ముందుగా ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేయడానికి చిన్న బౌల్ని తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత అందులో నాలుగు టీ స్పూన్ల తాజా మీగడను వేసి.. బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ తేనెను వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మరోసారి ఐదు నిమిషాల పాటు కలిపి రెండు నిమిషాలు ఫ్రిజ్లో పెట్టుకోవాలి.
ఇలా ఫ్రిజ్లో నుంచి తీసిన మిశ్రమాన్ని నియోగిస్తే మీరే త్వరలో మంచి ఫలితాలు పొందుతారు.
ఈ ఫేస్ ప్యాక్ ని ఇలా వినియోగించండి:
ఈ ఫేస్ ప్యాక్ వినియోగించే ముందు ముఖాన్ని సాధారణ ఫేస్ వాష్ తో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత మీగడతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ని ముఖానికి బాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత అప్లై చేసుకున్న మిశ్రమాన్ని తేలికపాటి చేతులతో 20 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత మరో 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా తయారవుతుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Shraddha Das Photos: తళుకుబెళుకుల డ్రెస్సులో కైపెక్కిస్తున్న శ్రద్దా దాస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి