Village Bus Officers: టీఎస్ఆర్టీసీ సరికొత్త కార్యక్రమం.. గ్రామానికో బస్ ఆఫీసర్ నియామకం

Telangana Village Bus Officers: మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది టీఎస్ఆర్టీసీ. తెలంగాణలో విలేజ్ బస్ ఆఫీసర్ల నియామకం చేపట్టనుంది. బస్సులకు సంబంధించిన ప్రతి సమస్యను వీరి ద్వారా తెలుసుకుని పరిష్కరించనుంది. టీఎస్ఆర్టీసీ సేవలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లనుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 22, 2023, 05:59 PM IST
Village Bus Officers: టీఎస్ఆర్టీసీ సరికొత్త కార్యక్రమం.. గ్రామానికో బస్ ఆఫీసర్ నియామకం

Telangana Village Bus Officers: ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ). ఇప్పటికే అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టిన టీఎస్ఆర్టీసీ.. తాజాగా మరో ప్రయోగం మొదలుపెట్టనుంది. ఇక నుంచి రాష్ట్రంలో గ్రామాల్లో బస్ ఆఫీసర్లను నియమించనున్నట్లు వెల్లడించింది. ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విలేజ్ బస్ ఆఫీసర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. బస్ ఆఫీసర్లను సాధ్యమైనంత త్వరగా నియమించి.. మే 1వ తేదీ నుంచి బస్ ఆఫీసర్ల వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఆయన విడుదల చేశారు.

గ్రామాల్లో నివసించే టీఎస్ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, ఇతర ఉద్యోగులను విలేజ్‌ బస్‌ ఆఫీసర్లుగా డిపో మేనేజర్లు నియమిస్తారని సజ్జనార్ వెల్లడించారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండి.. స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకు వచ్చే వారిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. చిన్న గ్రామాలైతే.. రెండు మూడు విలేజ్‌లకు ఒక ఆఫీస్‌ను నియమిస్తామన్నారు. అయితే ఒక ఆఫీస్‌కు ఐదు కంటే ఎక్కువ గ్రామాలు కేటాయించేందుకు వీల్లేదన్నారు. హైదరాబాద్‌తోపాటు మిగిలిన మున్సిపాలిటీల్లోనూ వార్డుకు ఒక బస్‌ ఆఫీసర్‌ను డిపో మేనేజర్లు నియమిస్తారని.. వీళ్లు కూడా విలేజ్‌ బస్‌ ఆఫీసర్లలాగే పనిచేస్తారని చెప్పారు.

'విలేజ్‌ బస్‌ ఆఫీసర్లుగా నియమితులైన వారు గ్రామ ప్రజలతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటారు.  గ్రామస్తులతో 15 రోజులకు ఒకసారి సమావేశమవుతారు. బస్సుల రాకపోకలు, టైమింగ్స్, కొత్త రూట్‌లు, కొత్త సర్వీస్‌లు, సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారాన్ని ఉన్నతా అధికారులకు పంపిస్తారు. అంతేకాకుండా గ్రామాల్లో జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలు, జాతర వివరాలు కూడా అధికారులకు చెప్తారు. ఇందువల్ల ప్రయాణికుల రద్దీని ముందే తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా బస్ ట్రిప్పులను డిపో మేనేజర్లు పెంచుతారు. శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులు వినియోగించుకునేలా బస్ ఆఫీసర్లు గ్రామస్తులకు అవగాహన కల్పిస్తారు..' అని వీసీ సజ్జనార్ వెల్లడించారు. బాగా పనిచేసే విలేజ్ ఆఫీసర్లను గుర్తించి.. ప్రతి మూడు నెలలకోసారి బెస్ట్‌ విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ అవార్డుతో సత్కరిస్తామని చెప్పారు. 

Also Read: Komatireddy Raj Gopal Reddy: ఎమ్మెల్సీ కవిత‌తో కలిసి రేవంత్ రెడ్డి వ్యాపార లావాదేవీలు.. కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు  

ప్రస్తుతం గ్రామాల్లో బస్సులకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే.. డిపో మేనేజర్లను సంప్రదించాల్సి వస్తోందన్నారు సజ్జనార్. చాలా ఊర్లకు డిపో దూరంగా ఉండడంతో ఇబ్బంది ఎదరువుతోందని.. విలేజ్‌ బస్‌ ఆఫీసర్‌ నియామకంతో ఇక నుంచి ఆ సమస్య ఉండదన్నారు. గ్రామస్తులు ప్రతి సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లవచ్చన్నారు. విలేజ్‌ బస్‌ ఆఫీసర్ల వ్యవస్థ ప్రజలు ఉపయోగించుకుని.. ప్రోత్సహించాలని ఆయన కోరారు. 

Also Read: Karnataka Elections: సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు హ్యాండిచ్చిన బీజేపీ.. అసలు కారణం చెప్పిన అమిత్ షా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News