Honey Moon Express Movie Review: హనీ మూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ రివ్యూ..

Honey Moon Express Movie Review:  చైతన్య రావు, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్. న్యూఏజ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 21, 2024, 02:17 PM IST
Honey Moon Express Movie Review: హనీ మూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ రివ్యూ..

రివ్యూ: హనీమూన్ ఎక్స్‌ప్రెస్
నటీనటులు:  చైతన్య రావు,హెబ్బా పటేల్, సుహాసిని, తనికెళ్ల భరణి, తదితరులు
మ్యూజిక్:  కళ్యాణి మాలిక్
ఆర్ఆర్:  ఆర్.పి.పట్నాయక్
సినిమాటోగ్రఫీ:  సిష్ట్యా VMK
ఎడిటర్:  ఉమా శంకర్
నిర్మాత, దర్శకత్వం :  బాలశేఖరుని
విడుదల తేది : 21-6-2024

అన్నపూర్ణ స్టూడియో కాలెజీకి డీన్ గా పనిచేసిన బాలశేఖరుని దర్శకత్వంలో సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం 'హనీమూన్ ఎక్స్‌ ప్రెస్'. హెబ్బా పటేల్, చైతన్య రావు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన సినిమా  'హనీమూన్ ఎక్స్‌ప్రెస్'. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..  

కథ విషయానికొస్తే..

సోనాలి (హెబ్బా పటేల్), ఇషాన్ (చైతన్యరావు) తొలిచూపులోనే ప్రేమలో పడిపోతారు. అంతేకాదు తమ లవ్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత వీరి కాపురంలో కొన్ని కలతలు ఏర్పడతాయి. ఈ సందర్బంగా ఓ రిలేషన్ షిప్ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్లకు దగ్గరకు వెళతారు. అయినా.. విడిపోదామని డిసైడ్ అవుతారు. ఈ క్రమంలో వీరిద్దరికి  పెద్దవాళ్లైన ఓ జంట బాల (తనికెళ్ల భరణి), త్రిపుర సుందరి (సుహాసిని) ఎదురువుతారు. ఆ తర్వాత ఈ ఓల్డ్ కపుల్ సలహాతో సోనాలి, ఈషాన్ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే ఓ రిసార్ట్ వెళతారు. ఈ సందర్భంగా వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. తిరిగి ఈ జంట ఒక్కటయ్యారా.. ? ఈ ఓల్డ్ కపుల్ ఎందుకు వీరి జీవితాలను మార్చాలనుకున్నారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకున్న యువజంటలు చిన్న చిన్న పొరపొచ్చాలకు విడిపోతున్నారు. ఒకరి ఇష్టాలను మరొకరు గౌరవించాలనేది ఈ సినిమాలో చూపెట్టారు దర్శకుడు బాల శేఖరుని. ప్రస్తుతం యూత్ పెళ్లి తర్వాత పడుతున్న పాట్లు.. పెళ్లి చేసుకున్న తర్వాత గత జీవితంలో జరిగిన సంఘటనలను భూతద్దంలో పెట్టి.. కాపురాలను పెటాకులు చేసుకుంటున్నారు. చిన్న, చిన్న ఇష్యూతో విడిపోతున్న జంటలకు ఈ సినిమా ఓ మెసేజ్ లాంటిది.

దర్శకుడు బాలశేఖరుని ఓ ఎన్నారైగా తాను అనుకున్న కథను స్క్రీన్ పై ప్రెజెంట్ చేసాడు. యూత్ ఫుల్ ఎంటర్టేనరర్ కు కాస్త సందేశం యాడ్ చేసాడు. అంతేకాదు అందులో హెబ్బా లాంటి హీరోయిన్ తో కాస్త శృంగారం ఒలికించాడు. మొత్తంగా తాను చెప్పాలనుకున్న కథ ప్రేక్షకులకు కన్ఫ్జూజన్ కలిగించిన ఫైనల్ గా ఈ సినిమా సైన్స్ ఫిక్షన్,టైమ్ ట్రావెల్ వంటి కాన్సెప్ట్ తో థ్రిల్ కు గురి చేసాడు.
అవి ప్రేక్షకులకు ఒకింత అసహనానికి తెప్పించినా.. తాను చెప్పాలనుకున్న పాయింట్ ను తెరపై బోల్డ్ గా చెప్పేసాడు. ప్రతి భార్య తన భర్త ఇలా ఉండాలిన కోరుకోవడం సహజం. అలాగే ప్రతి భర్త తన భార్య ఇలాగే ఉండాలని కోరుకునే భర్త అనే కాన్సెప్ట్ కు హనీమూన్ ఎక్స్‌ ప్రెస్ రిసార్ట్ లో ఎలా రియలైజ్ అయ్యారేనది కొత్తగా అనిపిస్తోంది. మరోవైపు తమ జీవితాన్ని బాగు చేయడానికి వాళ్లే ఫ్యాచర్ నుంచి రావడం అనేది ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తోంది.

నటీనటుల విషయానికొస్తే..
చైతన్య రావు ఇపుడిపుడే నటుడిగా రాణిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాడు. మరోవైపు హెబ్బా పటేల్ గురించి ఎంత చెప్పినా.. తక్కువ. ఇందులో కూడా మోతాదుకు మించి తన అందాల ప్రదర్శన చేసి యూత్ ను అట్రాక్ట్ చేసింది. సీనియర్ నటీనటులైన సుహాసిని, తనికెళ్ల భరణి  తమ పరిధి మేరకు రాణించారు. ఈ సినిమాలో కీ రోల్ పోషించారు.

మొత్తంగా హనీమూన్ ఎక్స్‌ప్రెస్.. వెరైటీ జర్నీ

రేటింగ్.. 2.75/5

Read more: Snakes: వామ్మో..ఇంట్లో బైట పడ్డ 32 పాము పిల్లలు.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News