Pachi Kobbari Pulao Recipe: పచ్చి కొబ్బరి పాల పులావ్ అనేది ఒక భారతీయ సాంప్రదాయ వంటకం. దీనిని బాస్మతి రైస్‌తో తయారు చేస్తారు. అలాగే చాలా మంది ఈ రెసిపీలో నెయ్యితో పాటు పచ్చి కొబ్బరి పాలను కూడా వినియోగిస్తున్నారు. విందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీంతో పాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. అయితే చాలా మంది దీనిని రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారు. నిజానికి ఇలా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిని ఇంట్లోనే తయారు చేసుకుని తినడం వల్ల చాలా మంచిది. మీరు కూడా ఈ పచ్చి కొబ్బరి పాల పులావ్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా సులభమైన పద్ధతిలో తయారు చేసుకోండి.
పచ్చి కొబ్బరి పాలతో పులావ్‌కి కావాల్సిన పదార్థాలు:
బాస్మతి బియ్యం - 2 కప్పులు
పచ్చి కొబ్బరి పాలు - 1 కప్పు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
సోంపు - 1 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 2
పచ్చిమిరపకాయలు - 2
ఉల్లిపాయ - 1 (తరిగినది)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
టమాటా - 1 (తరిగినది)
కరివేపాకు - 1 రెమ్మ
పుదీనా ఆకులు - 1/2 కట్ట
ఉప్పు - రుచికి సరిపడా
కారం - రుచికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా పచ్చి కొబ్బరి పాలతో పులావ్ తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ బౌల్‌లో బియ్యాన్ని వేసుకుని దాదాపు 30 నిమిషాలు నానబెట్టుకోండి.
ఒక గిన్నె స్టౌవ్‌పై పెట్టుకుని నూనె వేడి చేసి, జీలకర్ర, సోంపు, ఎండు మిరపకాయలు వేయించాలి.
తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాల్సి ఉంటుంది.
వాటిని బాగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సువాసన వచ్చేవరకు వేయించాలి.
ఇలా కలిపిన తర్వాత టమాటో, కరివేపాకు వేసి మెత్తబడేవరకు ఉడికించాలి.
నానబెట్టిన బియ్యం, ఉప్పు, కారం వేసి బాగా కలపాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
తర్వాత 2 కప్పుల నీరు పోసి, మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాల్సి ఉంటుంది.
నీరు ఆవిరైపోయిన తర్వాత, పచ్చి కొబ్బరి పాలు వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత 5 నిమిషాలు బాగా ఉడికించి, పుదీనా ఆకులతో అలంకరించి వేడిగా వడ్డించాలి.
చిట్కాలు:
పచ్చి కొబ్బరి పాలతో పులావ్ బాగా టేస్టీగా ఉండడానికి కొబ్బరి పాలలో కొద్దిగా పంచదార వేయవచ్చు.
అంతేకాకుండా ఇందులో మీకు ఇష్టమైన కూరగాయలు, కాయధాన్యలు, డ్రైఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు.
పులావ్‌ను మరింత రుచికరంగా చేయడానికి ఎక్కువ మోతాదులో నెయ్యిని కూడా వినియోగించవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి