Masala Vadai Recipe In Telugu: మసాలా వడ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలైతే ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. చాలామంది ఇళ్లలో సాయంత్రం పూట స్నాక్స్‌గా ఎక్కువగా పప్పుతో తయారుచేసిన మసాలా వడనే తయారు చేసుకుంటారు. ఎందుకంటే దీనిని తయారు చేసుకోవడానికి కొంత కష్టమైనా ఇది నోటికి ఎంతగానో రుచిని అందిస్తుంది. అంతేకాకుండా దీనిని వివిధ రకాల పప్పులతో తయారుచేస్తారు. కాబట్టి శరీరానికి కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది. అయితే కొంతమందికి తరచుగా ఒకే రకం మసాలా వడ తిని బోర్ కొడుతూ ఉంటుంది. దీనివల్ల మళ్లీ మళ్లీ తినాలనిపించదు. అయితే ఇలాంటి వారి కోసం మేము కొత్త రకమైన మసాలా వడ రెసిపీని పరిచయం చేయబోతున్నాం. ఈ మసాలా వడ ఎంత క్రిస్పీగానో..రుచిగానో ఉంటుంది. ఈ వడను తయారు చేసుకునే సులభమైన పద్ధతిని తెలుసుకోండి.
మసాలా వడ తయారీకి కావాల్సిన పదార్థాలు:
ఒకటిన్నర గ్లాస్ శనగపప్పు
అర గ్లాస్ మినప్పప్పు
నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండి
మూడు ఇంచుల అల్లం ముక్క
మూడు రెమ్మల కరివేపాకు
తగినంత పుదీనా
తగినంత ఉప్పు
ఫ్రైకి కావాల్సిన నూనె
ఒక కప్పు ఉల్లిపాయ తురుము
తయారీ పద్ధతి:
ముందుగా ఈ మసాలా వాడాను తయారు చేసుకోవడానికి పప్పులను నాలుగు గంటల పాటు నానబెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో శనగపప్పు, అల్లం, పచ్చిమిర్చిని వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే జార్‌లో మినప్పప్పు, పెసరపప్పును వేసి బాగా మిక్సీ కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్సీ కొట్టుకున్న మిశ్రమాలన్నిటిని ఓ పెద్ద గిన్నెలో వేసి, అందులోనే బియ్యపిండిని కలుపుకోవాలి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఆ తర్వాత ఇందులోనే తగినంత ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ఆకు వేసి బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత స్టౌ పై కళాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి కావాల్సినంత నూనె వేసుకొని బాగా వేడి చేయాల్సి ఉంటుంది. ఇలా కాగిన నూనెలో పిండి మిశ్రమాన్ని వడలుగా వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కన తీసుకోవాలి. అంతే సులభంగా క్రిస్పీ మసాలా వడ రెడీ అయినట్లే..
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter