IRCTC Kerala Tour Package: బతుకమ్మ, దసరా సెలవుల్లో మీరు టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే మీకో బంపర్ ఆఫర్ ప్రకటించింది IRCTC. మీరు కేరళ ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ అద్భుతమైన టూర్ ప్యాకేజీని ఓసారి చూడండి. ఎందుకంటే కేరళ అంటేనే ప్రక్రుతి అందాలకు పెట్టింది పేరు. హౌస్ బోట్ రైడ్, హిల్ స్టేషన్స్ ఒక్కటేమిటీ ఎన్నో అందాలను అక్కడ చూడవచ్చు. ప్రక్రుతి ఒడిలో సేద తీరాలనుకునేవారికి ఈ సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది ఇండియన్ రైల్వే టూరిజం. కేరళలోని నాలుగు ప్రముఖ ప్రాంతాలతోపాటు మరెన్నో సుందరమైన టూరిస్టు ప్రదేశాలను కవర్ చేస్తూ ఈ ప్యాకేజీని తీసుకువచ్చింది.
నిత్యం ఆఫీసులు, ఇంటి పనులతో బిజీబిజీగా గడిపేవారు పిల్లలను తీసుకుని ఫ్యామిలీతో ఓ నాలుగు రోజులు కేరళలో గడిపితే ఆ ఆనందం వేరుంటుంది. మరి ఈ టూర్ ఎన్ని రోజులు..ఏయే ప్రదేశాలు కవర్ చేయవచ్చు..ఎంత ధర..ప్రయాణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు..ఇలాంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం.
కల్చరల్ కేరళ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది ఐఆర్ సీటీసీ. ఈ టూర్ లో అలెప్పి, కొచ్చి, మున్నార్, త్రివేండ్రం ప్రాంతాలను కవర్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి విమానం ప్రయాణం ఉంటుంది. ఈ ప్యాకేజీ మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు. ఇక ప్రయాణం వివరాలను చూద్దాం.
Also Read: Bank Holidays: దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులకు 28, 29 తేదీల్లో వరుసగా 2 రోజులు సెలవు..
మొదటి రోజు ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమాన ప్రయాణం స్టార్ట్ అవుతుంది. కేరళలో దిగానే ముందుగానే బుక్ చేసుకున్న హోటల్ కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ప్రార్థనమందిరం, డచ్ ప్యాలెస్, చైనీస్ ఫిషింగ్ నెట్ లను కవర్ చేస్తూ పోర్ట్ కొచ్చిని సందర్శిస్తారు. సాయంత్రం మెరైన్ డ్రైవ్ కు తీసుకువెళ్తారు. రాత్రికి కొచ్చిలో బస చేస్తారు.
రెండో రోజు హోటల్లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత మున్నార్ కు వెళ్తారు. మార్గమధ్య చీయపారా జలపాతాన్ని చూపిస్తారు. మున్నార్ చేరుకుని హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత టీ మ్యూజీయాన్ని సందర్శిస్తారు. రాత్రికి మున్నార్ లోనే బస చేయాల్సి ఉంటుంది.
మూడరోజు మున్నార్ లోని పలు పర్యాటక ప్రాంతాలను చూసిన తర్వాత ఆ రాత్రి కూడా మున్నార్ నే బస చేస్తారు.
నాలుగోరోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత తెక్కడికి తీసుకెళ్తారు. మార్గమధ్యలో స్పైస్ ప్లాంటేషన్స్ ను చూపించి..తేడక్కి హోటల్లో చెకిన్ అయి ఆ రాత్రి అక్కడే రెస్ట్ తీసుకుంటారు.
ఐదోరోజు హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత అలెప్పి, కుమరకోమ్ కు బయలుదేరుతారు. అలెప్పిలో సొంత ఖర్చుతోనే బ్యాక్ వాటర్స్ రైడ్ చేయాల్సి ఉ:టుంది. రాత్రికి అలెప్పి, కుమారకోమ్ లో బస చేస్తారు.
ఆరోరోజు బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత చడియమంగళంకు వెళ్తారు. జటాయు ఎర్త్ సెంటర్ ను సందర్శిస్తారు. తర్వాత త్రివేండ్రం వెళ్తారు. హోటల్లో చెక్ ఇన్ చేసి రాత్రి త్రివేండ్రంలోనే బస చేస్తారు.
ఏడోరోజు ఉదయం శ్రీ పదన్మాభస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. నేపియర్ మ్యూజియం, అజిమల శివ విగ్రహాన్ని దర్శించుకుని సాయంత్రం త్రివేండ్రం ఎయిర్ పోర్టులో డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకోగానే టూర్ ముగుస్తుంది.
Also Read: Ev Cars: ఈ 5 ఎలక్ట్రిక్ కార్లపై ఏకంగా రూ.15 లక్షల తగ్గింపు.. ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదు
కంఫర్ట్ లో అయితే సింగిల్ ఆక్యూపెన్సీకి రూ. 53,400, ట్విన్ షేరింగ్ కు 37,000, ట్రిపుల్ షేరింగ్ కు 34,850 చెల్లించాల్సి ఉంటుంది. 5ఏండ్ల నుంచి 11ఏండ్ల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ. 30,600, విత్ అవుట్ బెడ్ అయితే రూ. 25, 550గా ఉంది. ఈ ప్యాకేజీ అక్టోబర్ 14వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాలకోసం https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SHA35 ఈ లింక్ ను ఓపెన్ చేసి చెక్ చేసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.