How To Care Hair: కరివేపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో శరీరానికి కావాల్సిన యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఈ ఆకులు బ్యాక్టీరియాను తొలగించడానికి కీలక పాత్ర పోషించి జుట్టు ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశపశమనం కలిగిస్తుంది. ఈ ఆకుల్లో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, విటమిన్లు బి, సి అధిక పరిమాణాల్లో ఉంటాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకుంటే జుట్టుకు చర్మానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు జుట్టుకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా కరివేపాకును వినియోగించాల్సి ఉంటుంది.
కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలు:
జుట్టు సమస్యలన్ని తగ్గుతాయి:
కరివేపాకు జుట్టు పెరుగుదలకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి రిపేర్ చేస్తుంది. అయితే జుట్టును సంరక్షించుకోవడానికి ప్రతి రోజూ ఓ చిట్కాను వినియోగించాల్సి ఉంటుంది. అయితే దీని కోసం ముందుగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ఒక ఉసిరి కాయను తీసుకుని దానిని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. అందులో కరివేపాకు వేసి మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా చేసిన తర్వాత శుభ్రంగా చల్లిని నీటితో కడగాల్సి ఉంటుంది.
చుండ్రు కోసం:
కరివేపాకులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల జుట్టులోని చుండ్రును తొలగిండానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం పెరుగు తీసుకుని అందులో కరివేపాకు మిశ్రమాన్ని వేసి జుట్టుకు అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా 30 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
జుట్టు రాలడం:
అయితే దీని కోసం ముందుగా ఒక కప్పు నూనెను తీసుకుని అందులో కరివేపాకు రెమ్మలను వేసి ఉడికించాల్సి ఉంటుంది. ఇలా ఉడికించిన తర్వాత నూనెను తీసుకుని పడుకునే ముందు తలకు అప్లై చేస్తే చాలా రకాల జుట్టు సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా జుట్టు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
Also Read ; Adivi Sesh : HIT 2 ట్విస్టులు లీక్.. హీరోయిన్ అసలు విలన్.. అడివి శేష్ ట్వీట్ వైరల్
Also Read : Ram Charan in New Zealand : RC 15 న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి.. రామ్ చరణ్, కియారా లుక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook