Drinking Beer Prevent Kidney Stones: ప్రస్తుతం యువత కిడ్నీల్లో రాళ్ల సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారు. అయితే ఈ సమస్యల కారణంగా చాలా మంది తీవ్ర నొప్పులతో బాధపడుతున్నారు. అయితే దీనిని ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే పెయిన్ కిల్లర్‌ను వినియోగిస్తున్నారు. అయితే కొంత సమయం వరకు ఉపశమనం లభించి ఆ తర్వాత మళ్లీ నొప్పులు రావడం ప్రారంభమవుతున్నాయి. అయితే ఇలాంటి వారు ఉపశమనం పొందడానికి ఆల్కహాల్ లేదా బీర్ కూడా తీసుకుంటున్నారు. ఇంతకీ బీర్ తాగడం వల్ల కిడ్నీల్లో రాళ్లు తగ్గుతాయా? కిడ్నీల్లో రాళ్ల సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు బీర్ తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కిడ్నీల్లో రాళ్ల సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు బీర్ తాగడం వల్ల ఫలితాలు కలుగుతాయని ఆధారాలు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతి రోజు తాగితే మద్యానికి బానిసయ్యే ఛాన్స్ ఉంది. దీంతో పాటు కిడ్నీ దెబ్బతినడం, కిడ్నీ ఫెయిల్యూర్, బ్లడ్ ప్రెజర్, క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి రాళ్ల సమస్యలతో బాధపడేవారు బీర్ తాగకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
బీర్ తాగడం వల్ల కలిగే నష్టాలు:
రాళ్ల నొప్పి భరించలేని వారు బీర్ తాగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జీవితానికే చాలా ముప్పని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా రాళ్ల సమస్యలు కూడా పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అయితే కొంతమందిలో బీర్ తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఫలితాలు అందరికీ కలగవని నిపుణులు చెబుతున్నారు. కొంతమంది ప్రస్తుతం రాళ్లు బయటకు వస్తాయని విచ్చలవిడిగా బీర్‌లను తాగుతూన్నారు. ఇలా తాగడం వల్ల శరీరానికి చాలా హానికరమని నిపుణులు తెలుపుతున్నారు.
రాళ్లు ఎలా ఏర్పడతాయో తెలుసా?
కిడ్నీ స్టోన్స్ కాల్షియం, ఆక్సలేట్, కాల్షియం ఫాస్ఫేట్‌తో తయారవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని కరిగించడానికి మార్కెట్‌లో చాలా రకాల రసాయనాలతో కూడిన మందులు లభిస్తున్నాయి. మూత్రపిండాలు శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేసేందుకు సహాయపడతాయి. దీంతో పాటు విష పదార్థాలను కూడా తొలగించడానికి దోహదపడతాయి. కిడ్నీలో రాళ్లు ఆమ్ల లవణాలతో తయారవుతాయి. కాబట్టి వీటి వల్ల కిడ్నీల్లో తీవ్ర నొప్పులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా పని తీరులో కూడా మార్పులు కూడా రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి