Cooked Rice Papad Recipe: చాలామంది రాత్రిపూట రైస్‌ని ఎక్కువగా వండుకొని ఉదయాన్నే దానిని చెత్తబుట్టలో పడేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరింట్లో నెలకు 10 కేజీలకు పైగానే రైస్ పడేస్తున్నారు. అయితే ఇలా నైట్ మిగిలిపోయిన రైస్ తో అనేక రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. చాలామంది మిగిలిపోయిన అన్నంతో ఎక్కువగా వడియాలను తయారు చేసుకుంటూ ఉంటారు. మన పూర్వీకులు కూడా మిగిలిపోయిన అన్నంతో వడియాలు పెట్టుకునే వారంట. ముఖ్యంగా ఈ వడియాల్లో జీలకర్ర, ఇతర పోపు దినుసులను వేసి తయారు చేసుకోవడం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందుతారు. అయితే చాలామందికి మిగిలిపోయిన అన్నంతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో తెలీదు. అలాంటి వారికోసం ఈరోజు సులభమైన పద్ధతిలో వాటిని ఎలా తయారు చేసుకోవాలో? కావలసిన పదార్థాలు ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అన్నంతో అప్పడాలు తయారీ చేయడానికి కావాల్సిన పదార్థాలు:
మిగిలిపోయిన అన్నం
ఎండు మిరపకాయలు
ఉప్పు
ఆవాలు
జీలకర్ర
నూనె
తయారీ విధానం:
మిగిలిపోయిన అన్నం ఉంటే దాన్ని వాడండి. లేకపోతే కొత్త అన్నం వండుకుని చల్లారనివ్వండి.
చల్లారిన అన్నాన్ని ఒక పెద్ద పాత్రలోకి వేసుకుని మిశ్రమంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎండు మిరపకాయలను నీళ్ళలో నానబెట్టి, తొక్కలు తీసి, చిన్న చిన్న ముక్కలుగా తరిగి అన్నంలో కలపండి.
అందులో ఉప్పు, ఆవాలు, జీలకర్ర వీటిని కూడా అన్నంలో కలపండి.
ఇలా కలిపిన పదార్థాలు మిశ్రమంలా తయారయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత చిన్న చాప పరుచుకుని పలచగా వడియాలను వేసుకోండి.
ఈ వడియాలు కొంత ఆరిన తర్వాత ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకోండి.
వడియాలు ఎండిన తర్వాత వాటిని డబ్బలోకి ఎత్తిపెట్టుకోవాల్సి ఉంటుంది. అంతే అన్నంతో అప్పడాలు రెడీ అయినట్లే..
చిట్కాలు:
వడియాలను తయారు చేసేటప్పుడు చేతులు తడిగా ఉండకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది.
వడియాలను చాలా సన్నగా వేసుకుని త్వరగా ఎండిపోయే అవకాశాలు ఉన్నాయి.
వడియాలను ఎండు డబ్బాల్లో మూసి ఉంచడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.