Skin Care: మీ చర్మం నిత్య యవ్వనంగా కనిపించేలా ప్రేరేపించే 6 డ్రింక్స్.. తాగితే మ్యాజికల్‌ బెనిఫిట్స్‌..

Collagen Produce Foods: చర్మం నిత్యం యవ్వనంగా కనిపించాలని అందరూ ప్రయత్నిస్తారు. అయితే ముఖంపై మచ్చలు, గీతలతో అందంగా కనిపిస్తుంది. అయితే స్కిన్ కేర్ రొటీన్ తీసుకోవడంతో పాటు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే కొన్ని రకాల డ్రింక్స్‌ కూడా డైట్లో చేర్చుకోవాలి. దీనివల్ల మీ చర్మం నిత్య యవ్వనంగా కనిపిస్తారు .

Written by - Renuka Godugu | Last Updated : Jan 15, 2025, 03:59 PM IST
Skin Care: మీ చర్మం నిత్య యవ్వనంగా కనిపించేలా ప్రేరేపించే 6 డ్రింక్స్.. తాగితే మ్యాజికల్‌ బెనిఫిట్స్‌..

Collagen Produce Foods: మీ చర్మం నిత్య యవ్వనంగా మెరిసిపోవడానికి ప్రేరేపించే కొన్ని డ్రింక్స్ ఉంటాయి.. వీటిని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.. దీంతో మీరు నిత్య యవ్వనంగా కనిపిస్తారు. వయస్సు పెరిగే కొద్దీ మీ ముఖంపై వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించవు. ముఖంపై ఉన్న మచ్చలు గీతాలు తొలగిపోతాయి. చర్మం పొడిబారిన పడే సమస్య కూడా ఉండదు. అలాంటి డ్రింక్స్ తెలుసుకుందాం

నిమ్మనీరు..
నిమ్మకాయ నీటిని తీసుకోవడం వల్ల రోజంతటికీ కావలసిన హైడ్రేషన్ అందిస్తుంది. అయితే నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది ఇది సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది.. కానీ నిమ్మరసం, ఆరెంజ్, గ్రేప్ వంటి ఫ్రూట్స్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల మీ శరీరానికి విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది దీంతో మీరు యవ్వనంగా కనిపిస్తారు.

ఆకు కూరల రసం..
కొల్లాజెన్ ఉత్పత్తికి ఆకుకూరలతో చేసే స్మూథీలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇవి కొల్లాజెన్‌ ఉత్పత్తిని బూస్టింగ్ ఇస్తాయి. దీంతో మీ శరీరాన్ని కావలసిన విటమిన్స్‌, మినరల్స్ అందుతాయి. ముఖ్యంగా పాలకూర, కాలే, అరటిపండు, అవకాడో తయారుచేసిన స్మూథీలు మీ డైట్ లో చేర్చుకుంటే పెరుగుతుంది. దీంతో ప్రోటీన్ కూడా మీ శరీరంలో బూస్ట్ అవుతుంది .

 బెర్రీ స్మూథీ.. 
బెర్రీ స్మూథీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని సంరక్షిస్తాయి. కొల్లాజెన్‌ ఉత్పత్తి పెంచడం వల్ల నిత్య వివరంగా కనిపిస్తారు. ఒక గుప్పెడు బెర్రీ పండ్లను బాదంపాలు లేదా పెరుగులో వేసుకుని తీసుకోవాలి. చియా సీడ్స్ పాటు వీటిని తీసుకోవాలి. స్ట్రాబెరీ, బ్లూబెర్రీ వంటివి పెరుగు లేదా బాదం మిల్క్ తో తీసుకోవాలి .

కలబంద..
కలబంద కూడా మీ చర్మ సంరక్షణను కాపాడుతుంది. మీ చర్మానికి హైడ్రేటింగ్ అందిస్తుంది కలబంద తీసుకోవడం వల్ల కడుపు ఆరోగ్యానికి మేలు. చర్మంపై కొల్లాజెన్‌ ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది. ఇందులో పాళీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడతాయి. కొన్ని నివేదికల ప్రకారం ఇందులో ఫైబర్ కూడా ఉండటం వల్ల కడుపు సమస్యలు రాకుండా చేస్తుంది. ముఖం యవ్వనంగా గీతలు లేకుండా కనిపిస్తుంది .

ఇదీ చదవండి: అనుకున్నంత పని అయింది.. దాసు ప్రాణాలు తీయాలని తలపగులగొట్టిన జ్యోత్స్న.. ఆసుపత్రిలో శౌర్య సీరియస్..

పసుపు పాలు..
పసుపు పాలు పోషకాల పవర్ హౌస్‌. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మానికి కూడా పోషణ అందిస్తాయి. కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇందులో ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యలను తగ్గించే గుణం కలిగి ఉంటుంది. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. పాలల్లో పసుపు వేసి తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యకు కూడా ఎఫెక్టీవ్‌ రెమిడీ. 

కొబ్బరి నీరు..
కొబ్బరి బోండా నీటిని తీసుకోవడం వల్ల పోషకాలు పుష్కలం. ఇది చర్మం ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఎలక్ట్రోలైట్స్, ఖనిజాలు ఉంటాయి. మీ చర్మానికి హైడ్రేషన్ అందిస్తుంది. అంతేకాదు ఇందులో సైటోకైనిన్స్‌ కూడా ఉంటాయి. ఇది చర్మంపై ఆరోగ్యకరమైన సెల్ అభివృద్ధికి తోడ్పడుతుంది. కొల్లాజెన్‌ ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది.

ఇదీ చదవండి:  అదేంటి శోభిత అలా చేసింది? అవిలేకుండా పండుగపూట అడ్డంగా దొరికిపోయింది..!షాక్‌లో ఫ్యాన్స్‌..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News