Best Summer foods: ఎండా కాలంలో మీ బాడీని వెంటనే కూల్ చేసే పదార్ధాలేంటో తెలుసా?

Best Summer foods: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. వృద్దులు, మహిళలు మరియు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వడదెబ్బకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎండా కాలంలో ఈ హీట్ వేవ్ బారి నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి పుడ్ తీసుకోవాలో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 4, 2023, 06:41 PM IST
Best Summer foods: ఎండా కాలంలో మీ బాడీని వెంటనే కూల్ చేసే పదార్ధాలేంటో తెలుసా?

Cooling Foods For Summer In India: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉదయం నుంచే తన ప్రతాపాన్ని చూపించడం మెుదలుపెట్టాడు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎండల తీవ్రత 45 డిగ్రీలకుపైనే నమోదవుతుంది. ఎండలో తిరగడం వల్ల బాడీ వెంటనే హీట్ ఎక్కుతుంది. దీని వల్ల ప్రజలు డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంది. అందుకే వేసవిలో మన శరీరాన్ని వీలైనంత చల్లగా ఉంచుకోవాలి. దీని కోసం కొన్ని రకాల డ్రింక్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి. సమ్మర్ లో హీట్ ను తగ్గించే పదార్ధాలేంటో తెలుసుకుందాం. 

కొబ్బరి నీళ్లు
కొబ్బరి నీళ్లలో విటమిన్లు, ఖనిజాలు మరియు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని వేడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. 
పెరుగు
పెరుగు రుచిగా ఉండటమే కాదు బాడీ హీట్ ను కూడా తగ్గిస్తుంది. దీనిని మజ్జిగ లేదా లస్సీ రూపంలో తీసుకోవడం వల్ల ఇంకా మేలు జరుగుతుంది. 
సిట్రస్ పండ్లు
వేసవిలో సిట్రస్ జాతి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ లో పైబర్ తోపాటు వాటర్  కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి అధిక మెుత్తంలో ఉంటుంది. ఎండాకాలంలో నిమ్మ, నారింజ మరియు ఫైనాఫిల్ వంటి పండ్లు తీసుకోవడం వల్ల మీ బాడీలో వేడి తగ్గుతుంది. 

Also Read: Summer Health Tips: ఏ ఆహారాలు తిన్న జీర్ణం అవ్వడం లేదా? ఈ చిట్కాలతో మలబద్ధకం, అజీర్ణం సమస్యలకు సులభంగా చెక్!

దోసకాయ
దోసకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో అధిక మెుత్తంలో నీరు ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారించడంతోపాటు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. 
పుచ్చకాయ
వేసవి కాలంలో ఎక్కువగా లభించే వాటిల్లో పుచ్చకాయ ఒకటి. ఇందులో 91.45% నీర ఉంటుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవీ శరీరాన్ని చల్లబరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
ఆకు కూరలు
ఆకుకూరలు ఏడాది పొడవునా దొరుకుతాయి. ఆకుకూరలు తినడం వల్ల మీ శరీరానికి తగిన మెుత్తంలో నీరు అందుతుంది. అంతేకాకుండా మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

Also Read:  Anti Ageing Tips: 46 ఏళ్లైనా తరగని సుశ్మితా సేన్ అందం వెనుక సీక్రెట్ ఇదే, మీరూ వాడి చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News