Yogi Adityanath oath as Chief Minister: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు యోగి ఆదిత్యనాథ్. ఈ మేరకు శుక్రవారం (మార్చి 25) ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ యోగి ఆదిత్యనాథ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. యూపీలో ఐదేళ్ల పాలన పూర్తి చేసుకుని వరుసగా రెండోసారి సీఎం అయిన నేత యోగి ఆదిత్యనాథ్ మాత్రమే కావడం విశేషం.
ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎంలుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ప్రమాణ స్వీకారం చేశారు. యోగి మొదటి ప్రభుత్వంలోనూ కేశవ్ ప్రసాద్ మౌర్య డిప్యూటీ సీఎంగా ఉన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినప్పటికీ మరోసారి డిప్యూటీ సీఎంగా అవకాశమిచ్చారు. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న దినేశ్ శర్మ స్థానాన్ని తాజాగా బ్రజేష్ పాఠక్‌తో భర్తీ చేశారు. కేబినెట్లోకి మొత్తం 52 మందిని తీసుకున్నారు.
లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి స్టేడియంలో జరిగిన యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
కాగా, ఇటీవలి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 403 అసెంబ్లీ స్థానాలకు గాను 255 స్థానాల్లో విజయం సాధించింది. గతం కన్నా సీట్లు తగ్గినప్పటికీ వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టి 30 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. ప్రతిపక్షాలు సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాల్లో గెలుపొందగా.. కాంగ్రెస్ 2, బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్థానంలో మాత్రమే గెలుపొందాయి.
Also read: Flipkart mobile fest: ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ సేల్.. అన్ని ఫోన్లపై భారీ తగ్గింపు!
Also read: Realme C31: రియల్మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్- తక్కువ ధరలోనే అదిరే ఫీచర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook