UP Polls 2022 : తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో సీఎం యోగి... పోటీ అక్కడి నుంచే..

Yogi Adityanath contests from Gorakhpur: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2022, 02:32 PM IST
  • యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో సీఎం యోగి ఆదిత్యనాథ్
  • గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ
  • బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో వెల్లడి
UP Polls 2022 : తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో సీఎం యోగి... పోటీ అక్కడి నుంచే..

Yogi Adityanath contests from Gorakhpur: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అసెంబ్లీ (Gorakhpur Assembly) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి. యూపీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ఆ పార్టీ శనివారం (జనవరి 15) ప్రకటించగా.. అందులో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. నిజానికి అయోధ్య లేదా మథుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి యోగి బరిలో దిగవచ్చుననే ప్రచారం జరిగింది. కానీ బీజేపీ అధిష్ఠానం ఆయన్ను గోరఖ్‌పూర్ నుంచి బరిలో దింపేందుకే నిర్ణయించింది.
 

యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం ఎమ్మెల్సీ హోదాలో సీఎంగా కొనసాగుతున్నారు. దీంతో ఈసారి కూడా ఆయన ఎమ్మెల్సీ గానే ఉంటారా... లేక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. పలు సందర్భాల్లో దీనిపై స్పందించిన సీఎం యోగి... అది పార్టీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. తాజాగా బీజేపీ అధిష్ఠానం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాతో యోగి పోటీపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడినట్లయింది.

యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం 1998 నుంచి 2017 వరకు వరుసగా ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీ అధిష్ఠానం యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం చేసింది. దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేసిన యోగి.. ఎమ్మెల్సీ హోదాలో సీఎం పదవిలో కొనసాగుతున్నారు. గతంలో గోరఖ్‌పూర్ లోక్‌సభకు పోటీ చేసిన యోగి... ఇప్పుడు అక్కడినుంచే అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. గోరఖ్‌పూర్ లోక్‌సభ, అసెంబ్లీ రెండూ బీజేపీకి కంచుకోటలుగా ఉన్నాయి. ప్రస్తుతం గోరఖ్‌పూర్ అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యే రాధా మోహన్ దాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2002 నుంచి 2017 వరకు వరుసగా ఐదుసార్లు బీజేపీ తరుపున రాధా మోహన్ దాస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) ధీమాగా ఉన్నారు. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో 350 పైచిలుకు స్థానాలు సాధిస్తామని చెబుతున్నారు. మరోవైపు, కరోనా నియంత్రణ చర్యల్లో యోగి విఫలమయ్యారని.. యోగి హయాంలో రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ వాసులు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తం ఏడు విడతల్లో యూపీ అసెంబ్లీ పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Also Read: Acharya Official Announcement: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. 'ఆచార్య' సినిమా వాయిదా ! రిలీజ్ ఎప్పుడంటే..?

Also Read: UP Polls: యూపీలో కొత్త రాజకీయ సమీకరణాలు.. చంద్రశేఖర్ ఆజాద్‌తో చేతులు కలపనున్న అఖిలేశ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News