UPSC CDS 2 admit card 2024 released: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కాంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ 2 హాల్ టిక్కెట్లను విడుదల చేసింది. యూపీఎస్‌సీ సీడీఎస్ 2 ఎగ్జామ్ 2024 అప్లై చేసుకున్న అభ్యర్థులు వెంటనే వారి రోల్ నంబర్, పుట్టినతేదీ ఆధారంగా కాల్ లెట్టర్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లో దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలుసుకోవచ్చు.
యూపీఎస్‌సీ సీడీఎస్2 ఎగ్జామ్ 2024 సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి కాల్ లెట్టర్ వెంటనే డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవాలి. తుది ఫలితాలు విడుదల అయ్యే వరకు మీ వద్దే కాపీని తీసిపెట్టుకోండి. కాంబైన్ట్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ 2024 ఎలాంటి అడ్మిట్ పేపర్ కార్డును ప్రత్యేకంగా ఇవ్వదు. అయితే, కేవలం అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ఈ కాల్ లెట్టర్‌ను డైన్‌లోడ్ చేసుకోవాలి.
యూపీఎస్‌సీ సీడీఎస్ 2 అడ్మిట్ కార్డు 2024 డౌన్‌లోడ్ చేసుకునే విధానం..
యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత నోటిఫికేషన్ లింక్ 'యూపీఎస్‌సీ సీడీఎస్ 2 అడ్మిట్ కార్డు' హోంపేజీలో క్లిక్ చేయాలి.
అప్పుడు ఓ డైరెక్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు కావాల్సిన వివరాలను నమోదు చేయాలి.
యూపీఎస్‌సీ సీడీఎస్ 2 అడ్మిట్ కార్డు స్క్రీన్ కనిపిస్తుంది.
ఆ కాపీని వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: ఘోర విషాదం.. నదిలో పడిపోయిన బస్సు 14 మంది భారతీయుల మృతి!
అభ్యర్థులు తమ ఇ-అడ్మిట్ కార్డ్ ప్రింటౌట్‌ను పరీక్షకు హాజరు కావడానికి తమతోపాటు తీసుకెళ్లాలి. ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్ లేదా పాన్ వంటి గుర్తింపు పొందిన ఫోటోకాపీలను తమతో పాటు తీసుకెళ్లాలి. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమతోపాటు ఫోటో ఐడీ కార్డు తీసుకుని వెళ్లాలి. ఒకవేళ అడ్మిట్ కార్డుపై ఫోటో సరిగ్గా కనిపించకపోతే మీతోపాటు మరో మూడు పాస్‌ఫోటోలను తీసుకుని వెళ్లాలి. అంతేకాదు అడ్మిట్ కార్డులో ఉన్న సూచనలను ముందుగా క్షుణ్నంగా చదవాలి. ముందుగానే ఎగ్జామ్ సెంటర్‌ను కూడా అడ్రస్ వివరాలు తెలుసుకోవాలి. అడ్మిట్ కార్డుపరంగా మరిన్ని ఏవైనా సందేహాలు ఉంటే ఇమెయిల్ ఐడీ e16sectionupsc@gov.in కు ఇ మెయిల్ పంపండి. మీ సందేహాలకు సంబంధించిన సరైన వివరాలను వారు మీకు తెలియజేస్తారు.
ఇదీ చదవండి: కృష్ణాష్టమి బ్యాంకులకు సెలవు ఉంటుందా? పనిచేస్తాయా? ముందుగానే తెలుసుకోండి..
సీడీఎస్ 2 ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA), ఇండియన్ నేవల్ అకాడమీ (INA), ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA) ,ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA)లలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి