Union Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్‌లో అనూహ్య మార్పు.. న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు తొలగింపు.. కొత్తగా ఎవరంటే..?

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు శాఖలో అనూహ్యం మార్పు జరిగింది. ఆయనకు న్యాయశాఖ తప్పించి భూశాస్త్ర మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్ రామ్ మేఘ్వాల్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : May 18, 2023, 11:35 AM IST
Union Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్‌లో అనూహ్య మార్పు.. న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు తొలగింపు.. కొత్తగా ఎవరంటే..?

Kiren Rijiju: కేంద్ర మంత్రివర్గంలో ఆకస్మికంగా భారీ మార్పు చోటు చేసుకుంది. న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజును ఆ పదవి నుంచి ఉద్వాసన పలికారు. ఆయన స్థానంలో ఎంపీ అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు కేంద్ర న్యాయశాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది. ప్రధాని నరేంద్ర మోదీ రిక్వెస్ట్ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. కిరణ్ రిజిజును న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి తొలగించి.. ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు కేటాయించారు. మంత్రిమండలిలో మార్పులు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. 

తనను న్యాయశాఖ నుంచి తొలగించడంపై కిరణ్ రిజిజు స్పందించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోర్ట్‌ఫోలియోలు మార్చినట్లు తెలిపారు. తనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కడంతో అర్జున్ రామ్ మేఘవాల్ కాసేపట్లో ప్రధాని మోదీని కలవనున్నారు. ప్రగతి మైదాన్‌లో జరగనున్న ప్రభుత్వ కార్యక్రమంలో ప్రధానమంత్రితో కలిసి ఆయన హాజరకానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా అర్జున్ రామ్ మేఘవాల్ పనిచేస్తున్నారు.

రిజిజు జూలై 8, 2021న న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన మే 2019 నుంచి జూలై 2021 వరకు యువజన వ్యవహారాలు, క్రీడల రాష్ట్ర (స్వతంత్ర బాధ్యత) మంత్రిగా పనిచేశారు. బీజేపీ దళిత నేతలతో ఆయన ఒకరు. సింప్లిసిటీకి మరోపేరు కిరణ్‌ రిజుజు. న్యాయ శాఖ మంత్రి పదవి నుంచి కిరణ్ రిజిజును తొలగించడంపై విపక్షాలు స్పందించాయి. శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. "ఇది మహారాష్ట్రపై సుప్రీంకోర్టు తీర్పుతో ఇబ్బంది పడటం వల్లేనా..?" అంటూ కామెంట్స్ చేశారు.  

కేంద్ర ప్రభుత్వం తన ప్రతిష్టను కాపాడుకోవడానికి రిజిజును తొలగించిందని కాంగ్రెస్‌ నేత అల్కా లాంబా ఫైర్ అయ్యారు. న్యాయమూర్తుల నియామకం, కోర్టుల పని తీరుపై గత కొంత కాలంగా న్యాయ మంత్రిగా కిరణ్ రిజిజు చేస్తున్న వ్యాఖ్యలు, జోక్యం మోదీ ప్రభుత్వానికి ఇబ్బందులను తెచ్చిపెట్టాయని ఆయన అన్నారు.

Also Read: Amazon Shopping: అమెజాన్ వినియోగదారులకు షాక్.. ఈ వస్తువులపై ధరల పెంపు..?  

Also Read: Cabinet Meeting: కొత్త సచివాలయంలో తొలిసారి కేబినెట్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News