BJP National President: బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్ రెడ్డి.. ?

BJP National President: భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను బీజేపీ అధిష్టానం స్పీడప్ చేసింది. డిసెంబర్‌ కల్లా కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈసారి దక్షిణాది రాష్ట్రాల వారికే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. తద్వారా ఆ రాష్ట్రాల్లో పార్టీ మరింత బలోపేతం దిశగా చర్యలుంటాయని బీజేపీ వర్గాలు బలంగా చెబుతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 24, 2024, 06:02 PM IST
 BJP National President: బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కిషన్ రెడ్డి.. ?

BJP National President: ఇప్పటికే సంస్థాగత ఎన్నికల నిర్వహణకు పార్టీ ఎంపీ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలో ఎన్నికల కమిటీని నియమించారు. గత ఎన్నికల్లో అబ్ కీ బార్ చార్ సౌ పార్ అన్న బీజేపీ నినాదం పెద్దగా వర్కౌట్ కాలేదు. మొత్తంగా బీజేపీ 240 సీట్లకు.. ఎన్డీయే 293 సీట్లకే  పరిమితం అయింది.  ఈ సందర్బంగా  కమిటీ రెండ్రోజుల కిందటే పార్టీ కీలక నేతలతో వర్క్‌షాప్‌ నిర్వహించి సంస్థాగత ఎన్ని కల ప్రక్రియపై మార్గదర్శనం చేసింది. బీజేపీలో మొదట బూత్, ఆ తర్వాత మండల, ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తారు. ఎన్నికల అధికారులు ప్రకటించే తేదీల్లో బూత్, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడి ఎన్నికతోపాటు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడి ఎన్నిక కూడా నిర్వహిస్తారు. రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుల తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కౌన్సిల్‌ సభ్యులను ఎన్నుకోవాలి. రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు రాష్ట్రాల అధ్యక్షుడిని ఎన్నుకోనుండగా, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు 2 నెలల సమయం.. అంటే డిసెంబర్‌ రెండో వారానికి పూర్తవుతుంది, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం గత ఏడాది డిసెంబర్‌తో ముగిసింది. కానీ  సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీకాలాన్ని జూన్‌ 30 వరకు పొడిగించారు. ఆ తర్వాతా ఆయన్నే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేంద్ర ఆరోగ్య మంత్రిగా .. రాజ్యసభ అధినేతగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆరు నెలల నుంచి వివిధ పేర్లపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందులో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు సీనియర్‌ నేతలు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ , సునీల్‌ భూపేంద్ర యాదవ్‌ , దేవేంద్ర ఫడ్నవీస్‌ , ధర్మేంద్ర ప్రధాన్‌ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

కర్ణాటకలో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో పార్టీని మరింత విస్తరించాలని భావిస్తున్న బీజేపీ.. దక్షిణాది రాష్ట్రాల నుంచే అధ్యక్షుడిని ఎంపిక చేస్తుందని బలమైన ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశమున్న దృష్ట్యా, డిసెంబర్‌ రెండు లేదా మూడో వారానికి కొత్త అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తి చేయాలనే టార్గెట్ తో బీజేపీ అధినాయకత్వం ఉంది.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News