Bjp Leaders Tour: తెలంగాణపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటడమే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. ఇందులోభాగంగానే రాష్ట్ర బీజేపీ నేతలతో ఢిల్లీ పెద్దలు వరుసగా సమావేశమవుతున్నారు. పార్టీ బలోపేతంగాపై చర్చిస్తున్నారు. తాజాగా ఢిల్లీకి గ్రేటర్ బీజేపీ కార్పొరేటర్లు వెళ్లారు. వీరితోపాటు ఇతర ముఖ్య నేతలు సైతం ఉన్నారు. రేపు ప్రధాని మోదీని కలవనున్నారు. ఈమేరకు అపాయింట్‌మెంట్ ఖరారు అయ్యింది.
రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో బీజేపీ నేతలు, కార్పొరేటర్లు సమావేశమవుతారు. భేటీలో రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చ జరిగే అవకాశం ఉంది. భవిష్యత్ కార్యాచరణపై మంతనాలు జరపనున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీ..టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు సంధించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈమేరకు నేతలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
ప్రధాని మోదీని కలుస్తున్న బీజేపీ కార్పొరేటర్లు అంతా పార్టీ పదువుల్లో కీలకంగా ఉన్నారు. వీరితోపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు సైతం ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పదాధికారులు కూడా ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో తమదే విజయమని కమలనాథులు చెబుతున్నారు.
Also read: Ka Paul Comments: అలా జరిగితే నేనే పీఎం..పవన్ సీఎం..కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Also read:Telangana Bonalu-2022: తెలంగాణలో బోనాల జాతరకు వేళాయే..పండుగ ఎప్పటి నుంచి అంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook