Supreme Court: షాహీ మసీదులో సర్వేకు సుప్రీం నో, అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే

Supreme Court: మధుర షాహీ ఈద్గా మసీదు నిర్వాహకులకు ఊరట కల్గించే అంశం. మసీదులై సర్వేపై  అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 16, 2024, 02:06 PM IST
Supreme Court: షాహీ మసీదులో సర్వేకు సుప్రీం నో, అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే

Supreme Court: ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి వర్సెస్ షాహీ ఈద్గా మసీదు వివాదంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. షాహీ ఈద్గా మసీదులో సర్వే చేపట్టాలని ఆదేశిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించడమే కాకుండా తదుపరి విచారణ జరిగే వరకూ సర్వే చేపట్టవద్దని స్పష్టం చేసింది. 

మధురలో షాహీ ఈద్గా మసీదులో సర్వేకు బ్రేక్ పడింది. శ్రీకృష్ణ జన్మభూమి వివాదం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. యూపీలోని మధులో మొఘల్ చక్రవర్తి కాలం నాటి షాహీ ఈద్గా మసీదు గతంలో శ్రీకృష్ణుడు జన్మించిన స్థలమని హిందూ సంఘాల ఆరోపణ. మధుర కోర్టులో గతంలో ఇదే అంశంపై 9 పిటీషన్లు దాఖలయ్యాయి. మధుర నుంచి అలహాబాద్ హైకోర్టుకు ఆ పిటీషన్లు బదిలీ అయిన తరువాత విచారణ జరిపిన న్యాయస్థానం శాస్త్రీయ సర్వే చేపట్టేందుకు అడ్వకేట్ కమీషనర్ నియమించింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల్ని ముస్లిం కమిటీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 

దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం హిందూ వర్గ న్యాయవాదులకు అస్పష్టమైన దరఖాస్చు చేయవద్దని సూచించింది. సర్వే కోసం కమీషనర్ నియమించాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్లపై చట్టపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని కోర్టు తెలిపింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటీషన్లపై స్పందన తెలియజేయాలని కోరుతూ సుప్రీంకోర్టు హిందూ సంఘాలకు నోటీసులు జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి విచారణ జరిగేవరకూ సర్వే చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. 

Also read: PM Modi AP Tour: నేడు ప్రధాని మోదీ ఏపీ పర్యటన, లేపాక్షి సందర్శన, నాసిన్ ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News