Petrol Rate: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై చర్చ జరుగుతోంది. ఇటీవల చమురు ధరలపై పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 సుంకం తగ్గించింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్ ధర రూ.9.50 నుంచి రూ.7 వరకు దిగి వస్తుందని అంచనా వేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ప్రకటన తర్వాత పలు రాష్ట్రాలు అదే బాటలో నడుస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులపై పన్నులు తగ్గిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. ఆయా రాష్ట్రాల ప్రకటనలపై హర్షం వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తగ్గించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. విపక్షాలు సైతం పన్ను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి.
మహారాష్ట్రలో లీటర్ పెట్రోల్‌పై రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 వ్యాట్ తగ్గిస్తూ ఠాక్రే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.2500 కోట్ల అదనపు భారం పడనుంది. ఇటు రాజస్థాన్‌లోనూ చమురు ధరలపై వ్యాట్ తగ్గించారు. లీటర్ పెట్రోల్‌పై రూ.2.48, డీజిల్‌పై రూ.1.16 మేర వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు సీఎం అశోక్ గెహ్లోత్ ప్రకటించారు. వ్యాట్ తగ్గడంతో రాజస్థాన్‌లో లీటర్ పెట్రోల్‌పై రూ.10.48, డీజిల్‌పై రూ.7.16 తగ్గుతుందని అధికారులు తెలిపారు.
చమురు ధరలపై సుంకం పన్ను తగ్గిస్తూ మోదీ ప్రభుత్వం ప్రకటించి వెంటనే కేరళ ప్రభుత్వం స్పందించింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.లీటర్ పెట్రోల్‌పై రూ.2.41, డిజిల్‌పై రూ.1.36 పన్ను తగ్గిస్తున్నామని సీఎం విజయన్ తెలిపారు. మొత్తంగా వ్యాట్,ఇతర పన్నులను తగ్గిస్తే చమురు ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒకలా ఉండనున్నాయి.
Also read:MLC Anantha Babu: డ్రైవర్ ను నేనే కొట్టి చంపా.. అంగీకరించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook