SSC GD 2024: కానిస్టేబుల్ అడ్మిట్‌ కార్డ్స్‌ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. డాక్యుమెంట్స్‌ ఏం కావాలో తెలుసా?

 SSC GD Constable PST/PET admit card 2024 out: సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF) ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ పీఎస్‌టీ/ పీఈటీ, డీవీ/ డీఎంఈ హాల్‌ టిక్కెట్లను ఈరోజు విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరవ్వనున్న అభ్యర్థులు సీఆర్‌పీఎఫ్‌ అధికారిక వెబ్‌సైట్‌ rect.crpf.gov.in ద్వారా నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Written by - Renuka Godugu | Last Updated : Sep 11, 2024, 05:02 PM IST
SSC GD 2024: కానిస్టేబుల్ అడ్మిట్‌ కార్డ్స్‌ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. డాక్యుమెంట్స్‌ ఏం కావాలో తెలుసా?

 SSC GD Constable PST/PET admit card 2024 out: ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ అడ్మిట్‌ కార్డులు విడుదల అయ్యాయి. కానిస్టేబుల్‌ పీఎస్‌టీ లేదా పీఈటీ పోస్టుల అడ్మిట్‌ కార్డులను విడుదల చేశారు. ఈ లింక్‌ ద్వారా నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి.సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF) ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ పీఎస్‌టీ/ పీఈటీ, డీవీ/ డీఎంఈ హాల్‌ టిక్కెట్లను ఈరోజు విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరవ్వనున్న అభ్యర్థులు సీఆర్‌పీఎఫ్‌ అధికారిక వెబ్‌సైట్‌ rect.crpf.gov.in ద్వారా నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్‌ ప్రకారం ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఈ నెల సెప్టెంబర్‌ 23 నుంచి షెడ్యూల్‌ చేయనున్నారు. 

ఈ ఎగ్జామ్‌కు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షకు తమతోపాటు అడ్మిట్‌ కార్డు ప్రింట్‌ కాపీని కూడా తీసుకువెళ్లాలి. అడ్మిట్‌ కార్డుకు అప్లై చేసుకున్న వారు అడ్మిట్‌ కార్డును ఈ లింక్‌ ద్వారా నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి.

సీఆర్‌పీఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌ rect.crpf.gov.in ఓపెన్‌ చేయాలి.
ఆ తర్వాత ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ పీఎస్‌టీ/పీఈటీ అడ్మిట్‌ కార్డు 2024 హోంపేజీలో ఉండే లింక్‌పై క్లిక్‌ చేయాలి.
అప్పుడు ఓ కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ కావాల్సిన లాగిన్‌ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత సబ్మిట్‌ బట్టన్‌పై క్లిక్‌ చేయాలి.
అప్పుడు మీ అడ్మిట్‌ కార్డు స్క్రీన్‌ పై కనిపిస్తుంది. 
మీ అడ్మిట్‌ కార్డు వివరాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకోండి. 
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆ కాపీని మీ వద్దే భద్రపరచుకోండి.

ఇదీ చదవండి: స్టార్‌ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య.. 7వ ఫ్లోర్‌ నుంచి దూకి సూసైడ్‌..

ఈ అభ్యర్థులకు హోం మంత్రిత్వ శాఖ పీఎస్‌టీ (ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్)/ పీఎస్‌టీ (ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, డిటైల్డ్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌/ రివ్యూ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ (RME) నిర్వహిస్తారు.

ఎస్‌ఎస్‌సీ జీడీ రాత పరీక్షను 2024 ఫిబ్రవరి 20 నుంచి 7, మార్చి 30 లలో నిర్వహించారు. ఆ పరీక్ష ఫలితాలను జూలై 11వ తేదీన విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఎస్‌ఎస్‌సీ జీడీ 46617 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో బీఎస్‌ఎఫ్ 12,076 పోస్టులు  సీఐఎస్‌ఎఫ్ 13,632,   సీఆర్‌పీఎఫ్ 9410, ఎస్‌ఎస్‌బీ 1926, ఐటీబీపీ 6287, ఏఆర్‌ 2990, ఎస్‌ఎస్‌ఎఫ్ 296 పోస్టులను భర్తీ చేయనున్నారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

ఇదీ చదవండి: మరో 3 రోజులే ఉచితం.. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే మీ 10 ఏళ్ల పాత ఆధార్‌ కార్డును అప్డేడ్‌ చేసుకోండిలా..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News