Republic Day 2023 Quiz: రిపబ్లిక్ డే గురించి మీకు ఎంత బాగా తెలుసో చెక్ చేసుకోండి ?

Republic Day 2023 Quiz, Interesting Facts: ఇండియాలో 1950 నుండి ప్రతీ సంవత్సరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ.. ఇలా భారత త్రివిధ దళాల భాగస్వామ్యంతో ప్రతీ సంవత్సరం పెద్ద ఎత్తున రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది.

Written by - Pavan | Last Updated : Jan 25, 2023, 07:16 PM IST
Republic Day 2023 Quiz: రిపబ్లిక్ డే గురించి మీకు ఎంత బాగా తెలుసో చెక్ చేసుకోండి ?

Republic Day 2023 Quiz, Interesting Facts: రిపబ్లిక్ డే 2023 సంబరాలకు సమయం ఆసన్నమైంది. జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలకు యావత్ దేశం సిద్ధమైంది. ఇంకొన్ని గంటల్లో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరేయనున్నారు. ఈ నేపథ్యంలో మనం అందరం ఇంత గొప్పగా చెప్పుకుని, వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటున్న రిపబ్లిక్ డే గురించి మీకు ఎన్ని విషయాలు తెలుసో తెలుసుకోవడానికి మీ ఐక్యూ చెక్ చేసుకోండి. 

1) రాజ్యాంగం తొలిసారిగా అమలులోకి వచ్చిన ఏడాది ఎప్పుడు ?
ఎ)  1947  
బి) 1948
సి) 1950

2) రాజ్‌పథ్ మార్గంలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించింది ఎప్పుడు ?
ఎ)  1947  
బి) 1951
సి) 1955

3) భారత్‌తో పాటు రవింద్రనాథ్ ఠాగూర్ మరొక దేశానికి కూడా జాతీయ గీతం రచించారు. ఆ దేశం ఏది ?
ఎ)  పాకిస్థాన్  
బి) శ్రీలంక
సి) బంగ్లాదేశ్

4) ఈ ఏడాది ఇండియా 73వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది ?
ఎ)  అవును  
బి) కాదు

5) బీటింగ్ రిట్రీట్ సెరెమనీ ఏ రోజున జరుగుతుంది ?
ఎ)  జనవరి 26 
బి) ఆగస్టు 15,
సి) జనవరి 29    

6) ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున పరేడ్ ఎక్కడి నుంచి ముందుగా ప్రారంభం అవుతుందో తెలుసా ?
ఎ)  ఇండియా గేట్ 
బి) రాష్ట్రపతి భవన్, 
సి) రెడ్ ఫోర్ట్
 
7) రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న తొలి విదేశీ మిలిటరీ సైన్యం ఏది ?
ఎ) 2018 లో ఫ్రెంచ్ ఆర్మీ సోల్జర్స్  
బి) 2020 లో బ్రిటీష్ ఆర్మీ సోల్జర్స్ 
సి) 2018 లో ఆస్ట్రేలియా ఆర్మీ సోల్జర్స్

పైన అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబులు సరిచూసుకోవడానికి ఈ కింది సమాచారాన్ని పరిశీలించండి.

1) రాజ్యాంగం తొలిసారిగా అమలులోకి వచ్చిన ఏడాది ఎప్పుడు ?
జవాబు: 1950

2) రాజ్‌పథ్ మార్గంలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించింది ఎప్పుడు ?
జవాబు: 1955

3) భారత్‌తో పాటు రవింద్రనాథ్ ఠాగూర్ మరొక దేశానికి కూడా జాతీయ గీతం రచించారు. ఆ దేశం ఏది ?
జవాబు: బంగ్లాదేశ్

4) ఈ ఏడాది ఇండియా 73వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది ?
జవాబు: కాదు  

5) బీటింగ్ రిట్రీట్ సెరెమనీ ఏ రోజున జరుగుతుంది ?
జవాబు: జనవరి 29    

6) ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున పరేడ్ ఎక్కడి నుంచి ముందుగా ప్రారంభం అవుతుందో తెలుసా ?
జవాబు: రాష్ట్రపతి భవన్.

7) రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న తొలి విదేశీ మిలిటరీ సైన్యం ఏది ?
జవాబు: 2018 లో ఫ్రెంచ్ ఆర్మీ సోల్జర్స్ 

ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు

ఇది కూడా చదవండి : National Voters Day 2023: నేడే జాతీయ ఓటర్ల దినోత్సవం ఎందుకు ? చరిత్ర, ప్రాధాన్యత ఏంటి ?

ఇది కూడా చదవండి : Parliament New Building Photos: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఫోటోలు.. పాతదానికి, కొత్తదానికి డిజైన్ తేడా చూడండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News