Prime Minister Narendra Modi Tour: ప్రధాని నరేంద్ర మోదీ 7 నగరాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు 36 గంటల్లో 5,300 కిలోమీటర్లు ప్రయాణించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యప్రదేశ్, కేరళ, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ డయ్యూలలో పర్యటించనున్నారు. ప్రధాని టూర్ షెడ్యూల్‌ను శనివారం పీఎంవో అధికారులు విడుదల చేశారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రారంభమై మంగళవారం దమణ్ పర్యటనతో ముగుస్తుంది.
రేపు ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి.. 500 కి.మీ.ప్రయాణించి మధ్యప్రదేశ్‌లోని ఖజురహో చేరుకుంటారు ప్రధాని మోదీ. అక్కడి నుంచ రేవాలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ దాదాపు రూ.19 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ఖజురహోకు తిరిగివస్తారు. తరువాత 1,700 కి.మీ ప్రయాణించి కొచ్చిలో జరగనున్న యువమ్ సదస్సుకు హాజరుకానున్నారు.
మంగళవారం ఉదయం కొచ్చికి 150 కి.మీ. దూరంలో తిరువనంతపురం సెంట్రల్‌కు వెళ్లి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం రూ.3,200 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. తిరువనంతపురం నుంచి 1,570 కిలోమీటర్లు ప్రయాణించి సిల్వాసా (దమణ్ దీవ్)కి వెళతారు. దాద్రా, నగర్ హవేలీలో నమో మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభిస్తారు. అదేవిధంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం దమణ్‌కు వెళ్లి.. డేవ్కా సీఫ్రంట్‌ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి సూరత్ మీదుగా తిరిగి ఢిల్లీ చేరుకుంటారు.
Also Read: ఇదేక్కడి బౌలింగ్ సింగ్ మావా.. రెండుసార్లు స్టంప్‌లు విరగొట్టిన అర్ష్‌దీప్.. వాటి ధర ఎంతో తెలుసా..!
కేరళకు ప్రధాని మోదీ విచ్చేస్తున్న సందర్భగా బీజేపీ రాష్ట్ర విభాగం పూర్తి ఏర్పాట్లు చేస్తోంది. అయితే మోదీ పర్యటన సందర్భంగా ఆత్మాహుతి దాడులు జరుపుతామంటూ బెదిరింపు లేఖ రావడం కలకలం రేపుతోంది. కొచ్చిలో ఆత్మహుతి దాడులు చేస్తామని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ గత వారం రాగా.. ఆలస్యంగా వెలుగు చూసింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి లేఖను పంపించారు. దీంతో కేరళ పోలీసులు ప్రధాని టూర్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఈ లేఖపై ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు`చేస్తోంది.
Also Read: Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికల జోరు.. తొలిసారి ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి