Mohan Majhi Odisha Chief Minister: ఒడిషాలో భారతీయ జనతా పార్టీ సంచలన విజయం సాధించింది. గత రెండు పుష్కరాలుగా ఆ రాష్ట్రాన్నిపరిపాలిస్తోన్న బిజూ జనతాదళ్ కు చెందిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నవీన్ పట్నాయక్ ను గద్దే దించడం అంటే మాములు విషయం కాదు. కాంగ్రెస్, బిజూ జనతా దళ్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఒడిషాలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సామాన్య కార్యకర్త అయిన మోహన్ చరణ్ మాఝిని నియమించింది. ఒడిషా గవర్నర్ రఘుబర్ దాస్ .. మోహన్ మాఝి చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో ఆరు సార్లు ఎమ్మెల్యగా ఎన్నికైన కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేగా అయిన ప్రవతి పరీదాలు డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేసారు.
వీరితో పాటు మంత్రలుుగా రబీనారాయణ నాయక్, సురేష్ పూజారి,కృష్ణ చంద్ర పాత్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో జరిగిన జనతా మైదాన్ లో ఈ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా భువనేశ్వర్ వెళ్లి.. ఒడిషా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హాజరై నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఒడిషా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ సీఎం నవీన్ పట్నాయక్ హాజరు కావడం విశేషం. కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన మోహన్ మాఝి స్వయంగా వెళ్లి నవీన్ పట్నాయక్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. 147 స్థానాలున్న ఒడిషా అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ మార్క్ 74 స్థానాల కంటే 4 శాసన సబ స్థానాలను అధికంగా గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక గత ఎన్నికల వరకు అధికారంలో ఉన్న బిజూ జనతా దళ్ 51 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో విజయం సాధించింది. కమ్యూనిస్టు పార్టీ 1, ఇతరులు 3 స్థానాల్లో జయకేతనం ఎగరేసారు.
ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ కలిపి దేశంలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సంఖ్య 22కు చేరింది. అందులో బీజేపీ సొంతంగా 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే.. కూటమితో కలిసి 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.
ఇక గిరిజన నేత మోహన్ చరణ్ మాఝి తండ్రి సామాన్య రైతు. అటు సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు.మాఝి 1997 నుంచి 2000 వరకు సర్పంచిగా బాధ్యతలు నిర్వహించారు. ఇక 2000 లో ఫస్ట్ టైమ్ శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీజేపీ గిరిజన మోర్చాకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. లా చదివిన ఈయన కేంఝర్ శాసన సభ స్థానం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు .2000, 2009, 2024లో శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019 నుంచి 2024 వరకు బీజేపీ శాసన సభ పక్ష కార్యదర్శిగా ఛీప్ విప్ గా బాధ్యతలు నిర్వహించారు.
ఇదిలాఉంటే, గిరిజన నేత మోహన్ చరణ్ మాఝి రైతు బిడ్డ. ఈయనది రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు చెందిన మయూర్ భంజ్ సమీపంలోని కైకల గ్రామం ఆయన స్వస్థలం. ఆయన తండ్రి సెక్యూరిటీ గార్డుగానూ పని చేశారు. 1997 నుంచి 2000 వరకు సర్పంచిగా పనిచేసిన మాఝి.. 2000లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. భాజపా గిరిజన మోర్చాకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతులు నిర్వహించారు. న్యాయశాస్త్ర పట్టభద్రుడైన ఆయన... కేంఝర్ అసెంబ్లీ స్థానం నుంచి నాలుగుసార్లు 2000, 2009, 2019, మళ్లీ 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 నుంచి 2024 వరకూ శాసనసభలో భాజపా సభాపక్ష కార్యదర్శిగా, చీఫ్ విప్‌గా విధులు నిర్వహించారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున హేమానంద బిస్వాల్, గిరిధర్ గమాంగ్ ఒడిషాలో గిరిజన సీఎంలుగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా మోహన్ చరణ్ మాఝి ఒడిషాలో మూడో గిరిజన ముఖ్యమంత్రి అయ్యారు.
Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter